| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పార్లమెంట్ ఎన్నికలో ఢిల్లీ కోటపై కాంగ్రెస్ జెండా ఎగరవేయలి : మంత్రి శ్రీధర్ బాబు

పార్లమెంట్ ఎన్నికలో ఢిల్లీ కోటపై కాంగ్రెస్ జెండా ఎగరవేయలి : మంత్రి శ్రీధర్ బాబు

చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమవేశంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు

చేవెళ్ల లోకసభ సీట్ ను భారీ మెజారిటీతో గెలిపించుకుందాం : సునీత మహేందర్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో : రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. చేవెళ్ల నియోజికవర్గం మొయినాబాద్ మండల  హిమాయత్ నగర్ పరిధిలో జెపిఎల్ కన్వెన్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు . ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు  హాజరయ్యారు.ఈ సమావేశంలో  మంత్రి శ్రీధర్ బాబు  మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎలాగైతే ఎగిరేసామో.. అదే ఉత్సాహంతో పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఢిల్లీ కోటపై కాంగ్రెస్ జెండా ఎగరాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.. ప్రతి ఒక్క కార్యకర్త ఈ రెండు మూడు నెలలు కష్టపడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో.. మహిళలకు ఫ్రీ బస్,రాజీవ్ గాంధీ ఆరోగ్య శ్రీ,మరియు వచ్చే నెల నుండి ప్రభుత్వం ప్రవేశపెట్టను 500 కే గ్యాస్,ఫ్రీ కరెంట్ పథకాల గురించి ప్రజలకు వివరించాలని కోరారు.. అక్కడ నరేంద్ర మోడీ ఇక్కడ కేసీఆర్ చేస్తున్న మోసాల పట్ల ప్రజలకి వివరించాలని కార్యకర్తలను కోరారు.. ఎలాగైనా ఈసారి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం పక్కా అని.. అది ఆపడం ఎవరి తరం కాదని అన్నారు..


ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ సునీతా మహేందర్ రెడ్డి , మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పార్టీ గెలుపు కోసం కృషిచేయాలని, మహిళలు చట్టసభల్లో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు పార్టీలోకి రావడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం శాయశక్తులా కృషిచేస్తానని, చేవెళ్ల గడ్డ నుంచే గతంలో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రెండు సార్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చామని, ఇప్పుడు కూడా ఇక్కడ ఎంపీని భారీ మెజారిటీతో గెలిపించుకుందామని పిలుపునివ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ,తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ,ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ,జిల్లా అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి , మాజీ ఎమ్మెల్సీ యాదవ రెడ్డి ,చేవెళ్ల నియోజకవర్గ ఇంచార్జ్ పామైన భీమ్ భరత్ ,టిపిసిసి సభ్యులు షాబాద్ దర్శన్ ,సమయ కమిటీ చైర్మన్ సింపుల్ సత్యనారాయణ రెడ్డి ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు జనార్దన్ రెడ్డి,సురేందర్ రెడ్డి ,ఏ బ్లాక్ అధ్యక్షుడు మల్లారెడ్డి ,మధుసూదన్ రెడ్డి,జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు జ్యోతి బీమ్ భరత్ గ,పిఎసి చైర్మన్ చంద్రారెడ్డి ,ఐదు మండలాల అధ్యక్షులు వీరేందర్ రెడ్డి,వెంకటయ్య,జనార్దన్ రెడ్డి,చంద్రశేఖర్,తమ్మిలి మాణయ్య,వెంకట్ రెడ్డి ,జిల్లా కార్యదర్శి పామేనా భార్గవ్ ,నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పెంటా రెడ్డి ,శ్రీరామ్ నగర్ ఎంపిటిసి రామ్ రెడ్డి గారు,అందాపూర్ ఎంపిటిసి రవీందర్ రెడ్డి ,జిల్లా ఫిషర్మెన్ కమిటీ అధ్యక్షులు మహేందర్ ముదిరాజ్ ,ఫిషర్మెన్ కమిటీ మండల అధ్యక్షులు బిక్షపతి, కాంగ్రెస్ నాయకులు,మహిళలు తదితరులు  పాల్గొన్నారు.

Previous మిషన్ భగీరథకు ప్రత్యామ్నాయం చూపండి : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Next రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం
ADVERTISEMENT