| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సమస్యలు గుర్తించేందుకే.. న్యాయ యాత్ర : షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

సమస్యలు గుర్తించేందుకే.. న్యాయ యాత్ర : షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

షాద్ నగర్ నియోజకవర్గంలో మూడు రోజులపాటు యాత్ర

11, 12, 13 వ తేదీల్లో నియోజకవర్గంలో పాదయాత్ర షెడ్యూల్ ప్రకటన

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను గత పదేండ్లు అధికారంలో ఉన్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని ఈ జిల్లాలో ఉన్న ప్రధాన సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించుకోవడానికి పాలమూరు న్యాయ యాత్ర పేరుతో పాదయాత్రను సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీ చంద్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఈనెల 11వ తేదీన

(రేపు ఆదివారం) కొత్తూరు మండలం సిద్ధాపూర్ గ్రామంలో న్యాయాత్ర ప్రారంభం అవుతుందని ఈ కార్యక్రమానికి సిడబ్ల్యుసి సభ్యులు వంశీచంద్ రెడ్డి హాజరవుతున్నారని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మీడియాకు తెలిపారు. గత రోజులుగా మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మక్తల్, నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు మండలాల్లో పాదయాత్ర నిర్వహించారని సందర్భంగా ఆయన మాట్లాడారు. పదేండ్లుగా అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాలమూరు జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయనీ ఇప్పుడు రాష్ట్రంలో ప్రజా పాలన వచ్చిందని అన్నారు. ఇప్పుడైనా ఈ ప్రాంతానికి సాగునీరు, తాగునీటి వసతులు, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నాం అన్నారు. ప్రతి నియోజకవర్గంలోని మండలాలలో పర్యటించి సమస్యలను గుర్తించేందుకు యాత్ర చేపట్టారని ఇది ఎంతో అభినందనీయమని శంకర్ ప్రశంసించారు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి యాత్రలో భాగస్వాములవుతున్నారనీ ప్రతి గ్రామంలోనూ, మండల కేంద్రాలలోనూ వస్తున్న ఆదరణ ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందనీ పేర్కోన్నారు. పాదయాత్ర చేస్తున్న సందర్భంగా ఈ ప్రాంతానికి సాగునీరు, తాగునీరు సక్రమంగా అందడం లేదని చదువుకున్న యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక వారు పడుతున్న ఇబ్బందులను గుర్తించామని చెప్పారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం ప్రారంభించి సాగునీళ్లు ఇవ్వకుండా బీఆర్ఎస్ పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారని తెలిపారు. నారాయణపేట- కొడంగల్ నియోజకవర్గాలకు కృష్ణానది చెంతన ఉండి.. నీటి వనరులను సులభంగా వినియోగించుకునే అవకాశాలు ఉన్నా బీఆర్ఎస్ ప్రభుత్వం 160 కిలోమీటర్లకు పైగా దూరం నుంచి నీళ్లను తెస్తామని గొప్పలు చెప్పిందని పదేళ్లు దాటిన చుక్క నీళ్లు రాలేదని అందుకే నారాయణపేట- కొడంగల్ అంశం తెరపైకి వచ్చిందన్నారు. ఈ పథకాన్ని చేపట్టి మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలలోని లక్షా 30 వేలకు పైగా ఎకరాలకు సాగునీరు అందించే విధంగా నిధులు కూడా మంజూరయ్యాయని వారు తెలిపారు.

షాద్ నగర్ అసెంబ్లీలో న్యాయ యాత్ర షెడ్యూల్ ఇదే

షాద్ నగర్ నియోజకవర్గంలో యాత్ర ఆదివారం ఉదయం 8 గంటలకు కొత్తూరు మండలం సిద్ధాపూర్ లో ప్రారంభమవుతుందని ఎమ్మెల్యే శంకర్ యాత్ర షెడ్యూల్ మీడియాకు విడుదల చేశారు.

అక్కడినుండి ఎస్బి పల్లి, కొడిచెర్ల, పెంజర్ల మీదుగా కొత్తూరు మండల కేంద్రానికి చేరుకుని అక్కడ కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. మధ్యాహ్నం చేగుర్, వెంకమ్మగూడ, వీర్లపల్లి, అప్పారెడ్డి గూడ, సాయంత్రం నందిగామలో ఆరున్నరకు కార్నర్ మీటింగ్ ఉంటుందని తెలిపారు. 12వ తేదీ సోమవారం కొంధుర్గు మండలం పాత ఆగిర్యాల గ్రామం నుండి యాత్ర ప్రారంభం అవుతుందని ఆగిర్యాల, వెంకిర్యాల, తంగేళ్లపల్లి, కొందుర్గు మండల కేంద్రంలో కార్నర్ మీటింగ్ ఉంటుందని తెలిపారు. భోజన విరామం తర్వాత చౌదరి గూడెం మండలం ఎదిర, రావిర్యాల, గుర్రంపల్లి, ఇంద్రానగర్ అనంతరం మండల కేంద్రంలో కార్నర్ మీటింగ్ ఉంటుందని తెలిపారు. 13వ తేదీ మంగళవారం కేశంపేట మండలం నిర్ధవెల్లి గ్రామంలో నుండి యాత్ర ప్రారంభం అవుతుంది. లే మామిడి కాకునూర్ సుందరాపూర్  కేశంపేట మండల కేంద్రంలో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం ఫరూక్ నగర్ మండలం రామేశ్వరం కిషన్ నగర్ హాజిపల్లి షాద్ నగర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ ఉంటుందని ఎమ్మెల్యే  శంకర్ తెలిపారు. పెద్ద ఎత్తున యాత్ర కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు..

Previous గోదావరిఖనిలో సత్తా చాటిన దొంగలు
Next తెలంగాణ ఓట్ ఆన్ అకౌంట్ బ‌డ్జెట్.. ఆయా శాఖ‌ల‌కు కేటాయింపులు ఇలా..
ADVERTISEMENT