డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో:మాజీ ప్రధానికి భారత రత్న ప్రకటించటం తెలుగు జాతికే గర్వం కారణం అని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేపల్లి అశోక్ గౌడ్ అన్నారు.
.షాద్ నగర్ పట్టణంలోని ముఖ్య కూడలిలో శుక్రవారం దేశ మాజీ ప్రధాని కీ. శే. పి.వి నర్సింహ రావు గారి చిత్రా పటానికి పూల మాలలు ఘనంగా నివాళులు అర్పించి, మన తెలుగు బిడ్డ దేశంలో సంస్కరణలు తెచ్చి దేశ అభివృద్ధి పాటుపడిన గొప్ప సంస్కరణ వాదీ కి భారత రత్న ను ప్రకటించడం పట్ల దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ కి కృతజ్ఞతలు తెలిపి, స్వీట్లు పంచి వేడుకలు చేసిన బీజేపీ నాయకులు కక్కునూరి వెంకటేష్ గుప్తా,దొడల వెంకటేష్ యాదవ్, మఠం ఋషి,కూర్మయ్య,మలచల్ మురళి,సిరిపురం వెంకట రమణ,భూషణ్,శ్యామ్ సుందర్,కాసోజి శివ,శివ శంకర్, విజయ్,గట్టోజి విజయ్,నక్కల మల్లేష్,డాక్టర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు