| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

జాతీయ జనగణనలో బీసీ కుల గణన చేపట్టాలి : ఉప్ఫరి శేఖర్ సగర

జాతీయ జనగణనలో బీసీ కుల గణన చేపట్టాలి  : ఉప్ఫరి శేఖర్ సగర

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో : బిసి డిమాండ్ల సాధనకై దేశ రాజధాని ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో పాల్గొని తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు  ఉప్పరి శేఖర్ సగర. జనాభా దామాషా ప్రకారం చట్ట సభల్లో బీసీలకు 50శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేయాలని, జాతీయ జనగణనలో బీసీ కుల గణన చేపట్టాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ లలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద బీసీ సంక్షేమ సంఘం ధర్నా నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఎంపి బిబి పాటిల్, మాజీ రాజ్యసభ సభ్యులు  హన్మంత్ రావు, ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షులు రామకృష్ణ, తెలంగాణ సగర సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  గౌరక్క సత్యం సగర, బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కులకచర్ల శ్రీనివాస్, బిసి కుల సంఘాల రాష్ట్ర జేఏసి అధ్యక్షులు కుందారపు గణేషా చారి, బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు  మణిమంజరి సగర, జాతీయ విద్యార్థి సంఘం అధ్యక్షులు విక్రం గౌడ్, రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షులు శ్యాం కుర్మ, రాష్ట్ర మహిళా విభాగం నాయకురాలు  భాగ్యలక్ష్మి సగర, ప్రొఫెసర్ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Previous కేంద్ర మంత్రి మోరేశ్వర్ పాటిల్ ని కలిసిన ఉప్పరి శేఖర్ సగర
Next గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్‌కు భారీ షాక్.. పార్టీని వీడిన కీలక నేత
ADVERTISEMENT