ఉత్తుత్తనే తిరుగుతారు అధికారులు ఇంకా రెండు మూడు నెలలైతే మళ్లీ మనమే ఉంటాం కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో చాటుగా వైరల్ ప్రజా ప్రతినిధులు
డైలీ భారత్, మెదక్:మెదక్ జిల్లాలో కొనసాగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం, ప్రజాపాలన దరఖాస్తుల వివరాల సేకరణ సర్వేలను గురువారం , వెల్దుర్తి మండలం, హకింపెట్, ఉప్పు లింగాపుర్, గ్రామల లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆకస్మికంగా తనిఖీ చేశారు, ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా మహాలక్ష్మి పధకం గ్యాస్ కోసం తప్పుగా నమోదు చేసిన దరఖాస్తు చేసుకున్న వారి యొక్క వివరాలను క్షేత్రస్థాయిలో ఇంటింటికి తిరిగి గ్యాస్ డెలివరీ రిసిప్ట్ లో ఉన్న కన్జ్యూమర్ (ఖాతా నెంబర్) పూర్తి వివరాలను సేకరించి స్పష్టమైన సమాచారం ప్రజాపాలన ప్రత్యేక యాప్*లో వెంట వెంటనే నమోదు చేయాలని సంబంధిత సిబ్బందిని ఆయన ఆదేశించారు,
ఈ నెల 7 నుండి 14 వరకు నిర్వహించే (కొనసాగుతున్న) ప్రత్యేక పారిశుద్ధ్య వారోత్సవాల కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారం ప్రత్యేక అధికారులు, గ్రామస్థాయి సిబ్బంది ఆ కార్యక్రమాలను నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ ,అధికారులుసిబ్బంది పాల్గొన్నారు.