| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కామారెడ్డిలో రూ.22 లక్షలతో కొత్త స్కూల్! చైర్‌పర్సన్ చేతుల మీదుగా ఘన ప్రారంభం!

కామారెడ్డిలో రూ.22 లక్షలతో కొత్త స్కూల్! చైర్‌పర్సన్ చేతుల మీదుగా ఘన ప్రారంభం!

డైలీ భారత్, కామారెడ్డి:కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 35వ వార్డులో భారతి SCS చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సుమారు రూ.22 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పాఠశాలను ప్రారంభించి, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యారంగ అభివృద్ధికి ప్రైవేటు సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ప్రభుత్వ పాఠశాలలకు సహకారం అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. సుమారు రూ.22 లక్షలతో పాఠశాల భవనాన్ని నిర్మించి విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించిన భారతి, SCS చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు అందినప్పుడే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని చైర్‌పర్సన్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వైస్ చైర్‌పర్సన్ కాసార్ల గోదావరి, కమిషనర్ పర్వతాలు, కౌన్సిలర్లు వినోద రాజు పాటిల్, మాధవి, TPO దేవరాజు, DEO మల్లికార్జున్, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ట్రస్ట్ ప్రతినిధులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

#డైలీభారత్ #కామారెడ్డి #Kamareddy #DailyBharat

Previous కాలుష్య నివారణకు ఈవీలే శరణ్యం: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Next భూ వివాదంలో దాడి చేసిన ముగ్గురికి షాక్! ఏకంగా మూడేళ్ల జైలు శిక్ష! 7 ఏళ్ల తర్వాత వచ్చిన సంచలన తీర్పు!
ADVERTISEMENT