| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మానవత్వం చాటుకున్న వేములవాడ పట్టణ పోలీసులు - ప్రజా రక్షణే కాదు... ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం!

మానవత్వం చాటుకున్న వేములవాడ పట్టణ పోలీసులు - ప్రజా రక్షణే కాదు... ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం!

డైలీ భారత్, వేములవాడ: పోలీసులంటే కేవలం నేరస్తులను పట్టుకోవడమే కాదు, ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందించడం కూడా వారి బాధ్యత అని వేములవాడ పట్టణ పోలీసులు మరోసారి నిరూపించారు.

వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలో ఈరోజు సాయంత్రం శివ అనే వ్యక్తి అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చి రోడ్డుపై కుప్పకూలిపోయాడు. అదే సమయంలో విధి నిర్వహణలో భాగంగా అక్కడ ఉన్న కానిస్టేబుళ్లు సల్మాన్, షకీల్, పంతులు నాయక్, నరేందర్, సతీష్ కుమార్, రాజ్‌కుమార్ ఈ విషయాన్ని గమనించారు.

వెంటనే స్పందించిన పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాధితుడి వద్దకు చేరుకుని మానవతా దృక్పథంతో ప్రథమ చికిత్స అందించారు. బాధితుడికి అవసరమైన సహాయం చేస్తూ చేతులు, కాళ్లు రుద్దడంతో కొద్దిసేపటికే ఆయన స్పృహలోకి వచ్చాడు.

విధి నిర్వహణలో ఉన్నప్పటికీ ఆపదలో ఉన్న వ్యక్తిని గమనించి, తక్షణమే స్పందించి మానవత్వం చాటుకున్న పోలీసు సిబ్బందిని స్థానిక ప్రజలు అభినందించారు.

Previous పశ్చిమ బెంగాల్‌లో భారీ ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం... రెండు చోట్ల STF దాడులు... పెను ముప్పు తప్పింది!
Next అగ్రి వర్సిటీలో లైంగిక వేధింపుల కలకలం : వీసీ అల్దాస్ జానయ్యపై మహిళా ప్రొఫెసర్ ఫిర్యాదు... విచారణకు ప్రతిపక్షాల డిమాండ్
ADVERTISEMENT