| Daily భారత్
Logo




వరదలు, ప్రకృతి వైపరీత్యాలను ఎదురుకునేందుకు అన్ని శాఖలు సమన్వయంగా పనిచేయాలి

News

Posted on 2026-06-03 16:31:51

Share: Share


వరదలు, ప్రకృతి వైపరీత్యాలను ఎదురుకునేందుకు అన్ని శాఖలు సమన్వయంగా పనిచేయాలి

రాబోయే వర్షాకాలం నేపథ్యంలో ఎస్‌డీఆర్‌ఎఫ్ ,డిడిఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ టీం మరియు అగ్నిమాపక  శాఖలతో  కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్‌డీఆర్‌ఎఫ్, డిడిఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ టీం మరియు అగ్నిమాపక  శాఖలతో  కోఆర్డినేషన్ మీటింగ్ బుధవారం నాడు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాలు, వరద ముంపునకు గురయ్యే గ్రామాలను ముందుగానే గుర్తించి, అక్కడ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. ముందస్తు చర్యలుగా  రక్షక బృందాలను ముంపుకు గురయ్యే ప్రాంతాల సమీపంలో ఏర్పాటు చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పోలీస్, ఎస్‌డీఆర్‌ఎఫ్ , డిడిఆర్ఎఫ్  సింగరేణి రెస్క్యూ టీం మరియు అగ్నిమాపక  శాఖలు  సమన్వయంతో పనిచేయాలని కోరారు. 

 బోట్లు, లైఫ్ జాకెట్లు, రోప్స్, చెట్లను తొలగించడానికి కావలసిన కట్టర్లను ఇతర రక్షణ సామాగ్రిని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. 

ప్రకృతి వైపరీక్షల సమయంలో ప్రజల ప్రాణ, ఆస్తులకు నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలుగా ప్రజలకు హెచ్చరికలు జారీ చేయాలని, సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో  డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ క్రాంతి కుమార్, టీజీఎస్పి అసిస్టెంట్ కమాండెంట్ మరియా దాస్,ఆపరేషన్ ఆర్ఐ బి. రవి, సింగరేణి రెస్క్యూ టీం ఇంచార్జ్ అనంత రాములు, రిజర్వ్ సబ్  ఇన్స్పెక్టర్లు సుమంత్, శ్రీకాంత్ పాల్గొన్నారు.

Image 1

సిరిసిల్లలో కమ్యూనిటీ కాంటాక్ట్... 60 వాహనాలు స్వాధీనం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసుల సూచన

Posted On 2026-07-25 07:31:14

Readmore >
Image 1

సాంకేతికతలో పోలీసులే ముందుండాలి...

Posted On 2026-07-25 07:07:57

Readmore >
Image 1

ప్రజల ప్రాణాలతో చెలగాటం... మల్కాజిగిరి కేక్స్ క్లబ్ బేకరీపై కేసు

Posted On 2026-07-25 07:06:03

Readmore >
Image 1

ప్రాణాలు పణంగా పెట్టి చిన్నారిని కాపాడిన అంబులెన్స్ సిబ్బంది ...

Posted On 2026-07-25 04:00:34

Readmore >
Image 1

రాఘవపూర్ గ్రామంలో వన మహోత్సవం లో భాగంగా ఈత మొక్కలు నాటిన ఎక్సైజ్ అధికారులు

Posted On 2026-07-24 19:19:00

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ ఎం. శ్రీనివాస్

Posted On 2026-07-24 19:17:19

Readmore >
Image 1

స్కూల్ బస్సు కిందపడి యూకేజీ విద్యార్థిని దుర్మరణం

Posted On 2026-07-24 17:51:05

Readmore >
Image 1

జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

Posted On 2026-07-24 17:38:47

Readmore >
Image 1

దమ్మపేటలో ఘనంగా బిజెపి నాయకులు తాండ్ర వినోద్ రావు పుట్టినరోజు వేడుకలు

Posted On 2026-07-24 16:54:48

Readmore >
Image 1

బిబిపేట మండలంలోని బిబిపేట గ్రామంలో ఎమ్మార్పీఎస్ సందర్శన

Posted On 2026-07-24 13:56:04

Readmore >