| Daily భారత్
Logo


సిరిసిల్లలో ఓ ఇంటి యజమని దౌర్జన్యం : కోర్టు నోటీసులు పంపిన బాధితుడు

News

Posted on 2023-12-18 18:25:04

Share: Share


సిరిసిల్లలో ఓ ఇంటి యజమని దౌర్జన్యం : కోర్టు నోటీసులు పంపిన బాధితుడు

డైలీ భారత్, సిరిసిల్ల :సిరిసిల్లలో ఓ ఇంటి యజమాని దౌర్జన్యం చేస్తున్నాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పట్టణానికి చెందిన బూర నరేందర్ వృత్తి రీత్యా హాస్పిటల్ పొప్రేటర్. పాత బస్టాండ్ సమీపంలోని 5-6-70/71/72 నెంబరు గల భవనాన్ని హాస్పిటల్ నిర్వహణ నిమిత్తం సిరిసిల్ల వాసి ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్న రాచ మధుసూదన్ వద్ద 4 సంవత్సరాల 4 నెలల 10 రోజులకు లీజుకు తీసుకుని ఆసుపత్రి నడిపిస్తున్నాడు. 31-12-2025 వరకు నరేందర్ తీసుకున్న లీజు చెల్లుబాటులో ఉంది. అయితే ఇంటి యజమాని భవనం లీజు గడువు పూర్తి కాకముందే అక్రమంగా కాళీ చేయించే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో సిరిసిల్ల కోర్టులో నరేందర్ దావా వేశారు. దావా నెంబరు OS 446 ఆఫ్ 2023 కోర్టులో పెండింగులో ఉన్న క్రమంలో సదరు యాజమాని భవనాన్ని సిరిసిల్ల కి చెందిన అడేపు మురళి,  అనే వ్యక్తికి రాచ మధుసూదన్ అమ్మే ప్రయత్నం చేస్తూ, తనకు తెలియకుండా ఆసుపత్రి బోర్డులు తొలగించి, భవనానికి తాలం వేసి తనపై దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నాడని, తనకు తెలియకుండా ఆ భవనంపై ఎవ్వరూ కుడా లీజుకు తీసుకోవడం, స్వరూపాన్ని మార్చడం, కొనుగోలు విషయంలో లావాదేవీలు చేయకూడదని శనివారం కోర్టు నోటీసులు పంపినట్లు ఆయన తెలిపారు. కాదని ఎవరైనా ముందుకు వస్తే తాను తీసుకోబోయే చట్టపరమైన చర్యలకు బాధ్యులు అవుతారని హెచ్చరించారు.


Image 1

ఘోర రోడ్డు ప్రమాదం

Readmore >
Image 1

భార్య పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న కలెక్టర్ గన్ మెన్

Readmore >
Image 1

ఏసీబీ చిక్కిన పోలీస్ స్టేషన్‌ రైటర్

Readmore >
Image 1

ప్రేమజంట ఆత్మహత్య?

Readmore >
Image 1

ఇంటి పెద్దను హతమార్చిన భార్య, కూతురు

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం: డ్రైవర్ మృతి

Readmore >
Image 1

అటెండర్‌తో బూట్లు మోపించిన జిల్లా కలెక్టర్

Readmore >