| Daily భారత్
Logo




గుండంరాజుపల్లి లో భద్రతకు కొత్త దిశ

News

Posted on 2026-04-05 08:13:21

Share: Share


గుండంరాజుపల్లి లో భద్రతకు కొత్త దిశ

సర్పంచ్ కమలాకర్ పనితీరుకు ప్రశంసలు! 

డైలీ భారత్ మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాచిన్నగూడూరు మండలం, గుండంరాజుపల్లి గ్రామంజిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆదేశాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా సర్పంచుల పోరం కన్వీనర్, డోర్నకల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గునిగంటి కమలాకర్ ఆధ్వర్యంలో గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు విజయవంతంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సబ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, గ్రామ భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ పోలీసింగ్‌లో ప్రజల భాగస్వామ్యం ఎంత ముఖ్యమో వివరించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ కమలాకర్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి పౌరుడు తప్పనిసరిగా హెల్మెట్ వినియోగించాలని, సీసీ కెమెరాలు నేరాల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రజల భద్రత కోసం అడుగులు వేస్తున్న నాయకత్వంగా గునిగంటి కమలాకర్ ముందుకు సాగుతుండగా, ఎస్పీ డాక్టర్ శబరీష్ చూపుతున్న విజన్, ఎస్సై ప్రవీణ్ కుమార్ అమలు చేస్తున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ కలిసి గుండంరాజుపల్లిని భద్రత గ్రామంగా తీర్చిదిద్దుతున్నాయి. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సునీత మురళీధర్ రెడ్డి, గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, పగిడిపల్లి సర్పంచ్ బిక్కు, ఫీల్డ్ అసిస్టెంట్ శంకర్ నారాయణ గౌడ్, వార్డు సభ్యులు ముఖేష్, పట్ల కిరణ్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పట్ల మధు, కాంగ్రేస్ సీనియర్ నాయకులు మూల ప్రభాకర్ రెడ్డి, గునిగంటి వెంకన్న, కుర్ర సోమయ్య, నెంబర్ లింగన్న, దిలీప్ రెడ్డి, చెక్కల ఉప్పలయ్య, చిల్వేరు ప్రవీణ్, బొంగు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.

Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >
Image 1

హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్

Posted On 2026-09-04 12:09:51

Readmore >