| Daily భారత్
Logo




గ్యాంగ్ ఫైల్స్ నేరాలపై జిల్లా ఎస్పీ కీలక సమీక్ష

News

Posted on 2026-03-24 15:13:54

Share: Share


గ్యాంగ్ ఫైల్స్ నేరాలపై జిల్లా ఎస్పీ కీలక సమీక్ష

నేరస్తులకు శిక్ష పడేలా పక్కా సాక్ష్యాధారాలు సేకరించాలి

కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో  జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

డైలీ భారత్, కామారెడ్డి: దొంగతనాలు, దోపిడీలు, రాబరీ నేరాలకు సంబంధించిన "గ్యాంగ్ ఫైల్స్" పై సంబంధిత అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. జిల్లాలో గతంలో నేరాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాల నేర ప్రవర్తన మరియు సాక్ష్యాధారాల సేకరణ వివరాల గురించి క్షుణ్ణంగా పరిశీలించిన ఎస్పీ, ప్రతి నేరస్తుడి పూర్తి ప్రొఫైల్‌ను పక్కాగా సిద్ధం చేయాలని ఆదేశించారు. వారిపై నిరంతరం నిఘా ఉంచాలని స్పష్టం చేశారు

నేరస్తులకు చట్టపరంగా కఠిన శిక్షలు పడేలా చూడటమే లక్ష్యంగా, పెండింగ్ కేసుల్లో విచారణను వేగవంతం చేయాలని ఎస్పీ  సూచించారు. కోర్టులో నిందితుల నేరాన్ని నిరూపించేలా శాస్త్రీయ మరియు సాంకేతిక సాక్ష్యాధారాలను పకడ్బందీగా సేకరించి, త్వరితగతిన అభియోగపత్రాలను దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు త్వరగా న్యాయం జరిగేలా ప్రతీ కేసులో అధికారులు వ్యక్తిగత శ్రద్ధ వహించాలని, ప్రాపర్టీ రికవరీపై ప్రత్యేక దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు.

జిల్లాలో నేరాల నియంత్రణకు గాను "ఆపరేషన్ కవచ్" ను మరింత బలోపేతం చేయాలని ఎస్పీ  నిర్ణయించారు. ఈ మేరకు సబ్ డివిజన్ అధికారులు మరియు సీఐలతో చర్చించి, రాత్రి గస్తీలను ముమ్మరం చేయడం, అనుమానిత ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టడం వంటి కీలక సూచనలు చేశారు. ఆధునిక సాంకేతికతను మరియు సిసి కెమెరాల నిఘాను సమర్థవంతంగా వాడుకుంటూ, జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు రాజీ లేకుండా పని చేయాలని అధికారులకు పిలుపునిచ్చారు.

ఈ సమీక్షా సమావేశంలో కామారెడ్డి ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి ఐపిఎస్, ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు, బాన్సువాడ డీఎస్పీ బి. విఠల్ రెడ్డి, వివిధ స్టేషన్ల ఇన్‌స్పెక్టర్లు, రైటర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు

Image 1

సింగరేణిలో గుర్తింపు సంఘాల గడువు ముగిసింది... అన్ని యూనియన్లకు సమాన హోదా ఇవ్వాలి

Posted On 2026-09-12 14:34:53

Readmore >
Image 1

గణేష్ మండపాలకు పోలీస్ ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి... జూలూరుపాడు SI జీనత్ కుమార్

Posted On 2026-09-12 06:24:45

Readmore >
Image 1

AIYF రాష్ట్ర సమితి సభ్యుడిగా ఎస్కే చాంద్ పాషా ఎన్నిక

Posted On 2026-09-11 17:13:23

Readmore >
Image 1

పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి

Posted On 2026-09-11 17:11:43

Readmore >
Image 1

అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్

Posted On 2026-09-11 17:09:19

Readmore >
Image 1

జనగణనలో బీసీ కాలమ్ కోసం ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 17:08:05

Readmore >
Image 1

భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్

Posted On 2026-09-11 15:57:20

Readmore >
Image 1

తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

Posted On 2026-09-11 14:51:47

Readmore >
Image 1

ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 14:50:44

Readmore >
Image 1

పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు

Posted On 2026-09-11 09:53:32

Readmore >