| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

దేశాన్ని ఆలోచింపజేసే రాహుల్‌ గాంధీ న్యాయ్‌ యాత్ర

దేశాన్ని ఆలోచింపజేసే రాహుల్‌ గాంధీ న్యాయ్‌ యాత్ర

తన వాహనానికి సొంతంగా భారత్ జోడో న్యాయ్ యాత్ర స్టిక్కర్ అంటించిన ఎమ్మేల్యే వీర్లపల్లి శంకర్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా బ్యూరో : భారత్ జూడో యాత్ర ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ న్యాయ యాత్ర చేపట్టడంతో దేశ ప్రజలను మళ్లీ ఆలోచింపజేస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. యాత్రకు సంబంధించిన వాహన స్టిక్కర్ ను తన వాహనానికి స్వయంగా అంటించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్

మాట్లాడుతూ మణిపూర్‌ నుంచి ముంబై వరకు ఈ యాత్ర ఉంటుందని, మొత్తం 6,700 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగుతుందని వివరించారు. దేశంలో యువత ఉద్యోగాలు, ఉపాధిలేక అల్లాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రతీ ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ సర్కార్‌ మోసం చేసిందని, పెట్రోల్, గ్యాస్, డీజిల్‌ ధరలు పెరిగిపోయాయని విమర్శించారు. దీంతో సామాన్య ప్రజల జీవనం కష్టంగా మారిందని అన్నా రు. బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యక్తులపై ఈడీ, ఐటీ సంస్థలను ఉపయోగిస్తున్నారన్నారు. మరోవైపు కిసాన్, దళిత, ఆదివాసీలు, మణిపూర్‌లో చర్చిలు, ముస్లిం మైనారిటీల మీద దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.

Previous 10 లక్షల దీపాల కాంతుల్లో అయోధ్య రామయ్య
Next దుబాయ్ డిజైనర్లు ఆర్కిటెక్ట్ లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
ADVERTISEMENT