| Daily భారత్
Logo




శీర్షిక : జాగ్రత్త మహిళా..!

Misc

Posted on 2026-02-24 11:03:46

Share: Share


శీర్షిక : జాగ్రత్త మహిళా..!

డైలీ భారత్ స్పెషల్: 

శీర్షిక : జాగ్రత్త మహిళా..!

గుంట నక్కలు ముసుగేసుకుని మన

చుట్టు తిరుగుతు మాయ మాటలు

చెప్పి నిన్ను  మాయం చేస్తారు జాగ్రత్త

మహిళా..!

మహిళ  చిరునవ్వుల చాటున

కన్నీటిచుక్కలు ఎవరికి తెలుసు...!

బడికి వెళ్లే ఆడ పిల్లపై నీ వెయ్యి

కన్నులు వేసి ఉంచు మహిళా..!

రెప్పపాటు ఆదమరచినావో 

డేగ లాగా తన్నుకొని పోతారు జాగ్రత్త

మహిళా..!

మహిళ  చిరునవ్వుల చాటున

కన్నీటిచుక్కలు ఎవరికి తెలుసు...!

పొలం పనుల కోసం పొయ్యేటప్పుడు 

బుడ్డదాన్ని వెంట తీసుకునిపో...

మరచి పోయినావో కామాంధుల

కాటుకు బలై పోతుంది జాగ్రత్త

మహిళా..!

మహిళ  చిరునవ్వుల చాటున

కన్నీటిచుక్కలు ఎవరికి తెలుసు...!

కూలి నాలికి పొయ్యేటప్పుడు చీడ

పురుగుల బారిన పడకుండా 

నిండు వస్త్రధారణతో వెళ్లు... 

మరచి పోయినావో  చుట్టు ముట్టి

చిత్రవధ  చేస్తారు జాగ్రత్త మహిళా..!

మహిళ  చిరునవ్వుల చాటున

కన్నీటి చుక్కలు ఎవరికి తెలుసు...!

అంతా నావాళ్ళే అని గుడ్డిగా నమ్మకు 

మహిళా..!

నీ వెనక గోతులు తీసేది నీ వాళ్ళే అని 

తెలుసుకో మహిళా..!

మహిళ  చిరునవ్వుల చాటున

కన్నీటి చుక్కలు ఎవరికి తెలుసు...!

సమాజంలో ఉన్న కొంత మంది

గురించి మాత్రమే వారు మంచిగా 

మారుతారు  అని  ఆశిస్తు...

తరలిపో తరలిపో.. చీకటి నుంచి వెలుగుకు తరలిపో.. కుందేలువి కావు.. పులిలా మారిపో.. వెంటాడే ఒడిదుడుకుల మృగాలతో యుద్ధానికి తరలిపో...’’ ఓ మహిళా మీకివే మా వందనాలు. కంటిపాపలా కాపాడే ‘స్త్రీమూర్తి’కి వందనాలు


శ్రీమతి మంజుల పత్తిపాటి (కవయిత్రి).

మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా

తెలంగాణ రాష్ట్రం

చరవాణి 9347042218.

Image 1

టింబర్ మర్చంట్స్ సంఘ అధ్యక్షున్ని సన్మానించిన షబ్బీర్

Posted On 2026-07-14 13:24:05

Readmore >
Image 1

"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం

Posted On 2026-07-14 13:21:15

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్

Posted On 2026-07-14 12:02:32

Readmore >
Image 1

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

Posted On 2026-07-14 11:38:49

Readmore >
Image 1

సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-07-14 11:17:33

Readmore >
Image 1

రూ. 2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ AE

Posted On 2026-07-14 09:33:44

Readmore >
Image 1

పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!

Posted On 2026-07-14 03:38:14

Readmore >
Image 1

కాంగ్రెస్ గూటికి బ్రహ్మణపల్లి గ్రామ సర్పంచ్

Posted On 2026-07-13 18:21:10

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణిలో 114 దరఖాస్తులు స్వీకరణ

Posted On 2026-07-13 18:18:22

Readmore >
Image 1

కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్‌

Posted On 2026-07-13 18:16:26

Readmore >