| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో పెయింటర్ మృతి..

విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో పెయింటర్ మృతి..

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల  విద్యుత్​ తీగలు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇళ్ల మీద నుంచి కరెంట్ తీగలు వెళ్తుండటంతో ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు. నిజామాబాద్ నగరంలోని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల సీతారాం నగర్ కాలనీలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఓ ఇంటిపై ఇటీవల అకాల వర్షాలకు, గాలి దుమారంకు  విద్యుత్ వైర్లు తెగి ఇంటిపై వేలాడడంతో అది గమనించని ఓ పెయింటర్​ విద్యుత్​ షాక్​తో మృతి చెందాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. ఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. కాలనీలో ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం చేపట్టాడు. పనులు కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన నాందేవ్​ (45) సంవత్సరాల వ్యక్తి ఆ ఇంటికి పెయింటింగ్​ వేయడానికి వచ్చాడు. అయితే ఇంటిపైన విద్యుత్​ తీగలు ఉన్నాయి. నాందేవ్ ప్రమాదవశాత్తు వాటికి తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై గంగాధర్​ ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Previous అసెంబ్లీలో కీలక బిల్లు ఆమోదం... BCలకు 42% రిజర్వేషన్లు సులభం
Next రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి
ADVERTISEMENT