అసలు బెల్ట్ షాపులకు మద్యం విక్రయిస్తున్నది ఎవరు..?
స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మద్యంపై అధిక ధరలు
డైలీ భారత్, దమ్మపేట: ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే నేటికీ మనకి స్వేచ్ఛ స్వతంత్రం పరిపూర్ణంగా ఉండటానికి గల కారణం అలాంటి పవిత్రమైన ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం ఆరోజున జోరుగా పట్వారిగూడెంలో ఓ బెల్ట్ షాపులో జోరుగా మద్యం అమ్ముతూ ఉండటం పలువురిని ఆశ్చర్యంపజేసే విషయంగా మారింది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల వ్యాప్తంగా గ్రామ గ్రామాన ప్రతి పల్లెలోనూ ప్రతి పాఠశాల కళాశాల తాసిల్దార్ కార్యాలయం పోలీస్ స్టేషన్ విద్యుత్ శాఖ కార్యాలయం సంబంధిత శాఖలలో ఎంతో పటిష్టాత్మకంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుతా ఉంటే, జీవహింస మద్యం ఈ ఆగస్టు 15 రోజున బంధు చేయాలి అటువంటిది పట్వారి గూడెం బెల్ట్ షాపులో యదేచ్చగా ముందు అమ్ముతున్నారు