| Daily భారత్
Logo




రేషన్‌కార్డు ఉంటే ఆదాయ ధ్రువీకరణ అవసరం లేదు

News

Posted on 2025-04-04 13:01:47

Share: Share


రేషన్‌కార్డు ఉంటే ఆదాయ ధ్రువీకరణ అవసరం లేదు

డైలీ భారత్, హైదరాబాద్‌: రాజీవ్‌ యువవికాసం పథకం కింద దరఖాస్తు చేసేందుకు రేషన్‌ కార్డు లేదా ఆహార భద్రత కార్డు ఉంటే సరిపోతుందని, ఆదాయ ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సిన అవసరం లేదని బీసీ కార్పొరేషన్‌ ఎండీ మల్లయ్య బట్టు స్పష్టం చేశారు. ఈ పథకం కింద ఇప్పటివరకు 7 లక్షల దరఖాస్తులు వచ్చాయని, దరఖాస్తు గడువును ఈ నెల 14వ తేదీ వరకు పొడిగించామని గురువారం ఒక ప్రకటనలో వివరించారు. ‘‘రేషన్‌కార్డు, ఆహార భద్రత కార్డు లేని అభ్యర్థులు మాత్రమే మీసేవ కేంద్రాల ద్వారా జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం నంబరును ఆన్‌లైన్లో నమోదుచేసి దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. 2016 నుంచి మీసేవ కేంద్రాల ద్వారా జారీ అయిన కుల ధ్రువీకరణ పత్రం ఉన్న అభ్యర్థులు ఆ పత్రాల నంబరుతో దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త కుల ధ్రువీకరణ పత్రానికి మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. మండల, మున్సిపల్‌ కార్యాలయాల్లోని ప్రజాపాలన కేంద్రాల్లో దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉన్నాయి’’ అని పేర్కొన్నారు.

Image 1

కూలీలను కబళించిన ప్రమాదం.. టైరు పేలడంతో బోల్తాపడ్డ టాటా ఏస్, ముగ్గురు మృతి

Posted On 2026-06-23 12:14:31

Readmore >
Image 1

నిజామాబాద్ లో ఎక్సైజ్ సూపరిండెంట్ ఇంట్లో ఏసీబీ అధికారుల దాడుల కలకలం

Posted On 2026-06-23 11:59:52

Readmore >
Image 1

ఒలింపిక్ స్ఫూర్తిని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి : మంత్రి వాకిటి శ్రీహరి

Posted On 2026-06-23 11:09:19

Readmore >
Image 1

బాసర ఆలయంలో దోపిడీ... అమ్మవారి కిరీటం మాయం

Posted On 2026-06-23 10:47:40

Readmore >
Image 1

పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్

Posted On 2026-06-22 21:29:25

Readmore >
Image 1

నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్

Posted On 2026-06-22 21:24:09

Readmore >
Image 1

ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది

Posted On 2026-06-22 20:54:00

Readmore >
Image 1

మున్సిపల్ చైర్‌పర్సన్‌ను కలిసిన టీయూడబ్ల్యూజే నాయకులు

Posted On 2026-06-22 20:52:39

Readmore >
Image 1

చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ

Posted On 2026-06-22 20:51:08

Readmore >
Image 1

సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి

Posted On 2026-06-22 20:50:12

Readmore >