| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

స్టేట్ బెస్ట్ టీచర్ కు బండి సంజయ్ కుమార్ సన్మానం

స్టేట్ బెస్ట్ టీచర్ కు బండి సంజయ్ కుమార్ సన్మానం

డైలీ భారత్, కరీంనగర్:రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పాకాల శంకర్ గౌడ్ (కుసుమ రామయ్య బాలుర ఉన్నత పాఠశాల- సిరిసిల్ల లో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు) ని ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ కరీంనగర్ లో అభినందించి, సన్మానించారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ...

శంకర్ గౌడ్ గత 27 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉపాధ్యాయునిగా  పనిచేస్తూ ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు కృషి చేస్తున్నారని, విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరులు పెంపొందించడానికి వినూత్న ఆవిష్కరణలకై నిరంతరం పాటుపడుతున్నారని అన్నారు.విద్యార్థులు సహ పాఠ్యాంశాల్లో కూడా ముందుండేలా ప్రోత్సహిస్తున్నారని ప్రశంసించారు.

అలాగే  సామాజిక అంశాలపై వివిధ తెలుగు దినపత్రికల్లో ఆర్టికల్స్ రాస్తూ సమాజాన్ని చైతన్య పరుస్తున్నారని,విద్యార్థులతో కలిసి తను తయారుచేసిన అనేక సైన్స్ ప్రాజెక్టులు మరియు ఎగ్జిబిట్స్ రాష్ట్ర,జాతీయ స్థాయిలో అవార్డులు సాధించడం అభినందనీయమని అన్నారు.శంకర్ గౌడ్ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి మరింతగా కృషి చేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధికారిక ప్రతినిధి సంగప్ప,నాయకులు సంపత్,అనిల్ కుమార్, శ్రీహరి,వేధ్ లు పాల్గొన్నారు.

Previous భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి సోషల్ మీడియాలో పరిచయమైన ప్రియుడితో పారిపోయిన వివాహిత
Next ఇంటికే ఇసుక.. బుకింగ్కు ప్రత్యేక యాప్
ADVERTISEMENT