| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన మాజీ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి

కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన మాజీ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లి మాజీ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డితో సహా పలువరు సర్పంచ్ లు, 500 మంది బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. నిన్న రేవంత్ రెడ్డి నాయకత్వంలో గాంధీ భవన్‌లో కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఢిల్లీ నుంచి వచ్చిన కొత్త ఇంచార్జీకి స్వాగతం పలుకుతూ సమావేశం పెట్టారు. రేవంత్ రెడ్డి మూడు ఆణిముత్యాల్లాంటి మాటలు చెప్పాడు. మంచి మైకుల్లో చెప్పాలి, చెడు చెవుల్లో చెప్పాలి అని చెప్పాడు. మంచి మైకుల్లో చెప్పుదామని అనుకుంటే, నువ్వు చేసిన మంచి పని ఏదీ లేదు. మైకుల్లో మంచి చెబుదామని అనుకునే సరికి కరెంట్ కట్ అయిపోయింది. చెడు చెవుల్లో చెప్పాలని మొదలు పెడితే, హైద్రాబాద్ నుంచి ప్రారంభించి ఆర్ఆర్ ట్యాక్స్, ఎస్ఎల్‌బీసీ ట‌న్నెల్, పెద్ద‌వాగు, మునిగిన వ‌ట్టెం పంప్ హౌజ్ గురించి చెబితే నీ చెవిలో రక్తం కారిపోతుంది రేవంత్ రెడ్డి... యాదిలో పెట్టుకో! రేవంత్ రెడ్డి చాలా తెలివిగా చెప్పానని డైలాగులు కొడుతున్నాడు," అని కేటీఆర్ విమర్శించారు.ఇక కొత్త ఇంచార్జి మీనాక్షి మాట్లాడుతూ.. "రైల్వేస్టేషన్‌లో దిగగానే బ్యాగులు మోసేందుకు కొంతమంది కాంగ్రెస్ నేతలు ఉరికొచ్చారు. బ్యాగులు మోసి మీ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయొద్దని చెప్పారు.” కానీ మీ పక్కన కూర్చొన్న వ్యక్తి చంద్రబాబు బ్యాగులు మోసి, ఇప్పుడు ఢిల్లీకి బ్యాగులు మోస్తున్నాడు. ఆయన్ని ప‌క్క‌న పెట్టుకుని బ్యాగులు మోయొద్దంటే ఆ మేడంకు ఏం చెప్పాలి. మీనాక్షి వాస్త‌వాలు తెలుసుకోవాల‌ని కోరుతున్నాన‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి మాటలు, కథలు చెప్పొద్దు. ఆయన చేసిన మంచి చెప్పుకుంటే వడిసిపోదట. ఈ పదిహేను నెలల కాలంలో ప్రజలందరూ వాట్సాప్‌లు, యూట్యూబ్‌లు చూస్తున్నారు. ఏ ఒక్క ఆడబిడ్డను పలుకరించినా, రేవంత్‌ను ఏకిపారేస్తున్నారు. తెలుగు భాషలో ఇన్ని తిట్లు ఉంటాయ‌ని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఏం తిట్లు అవి.. రోషం ఉన్నోడు అయితే పాడుబడ్డ బావిలో దూకి చ‌స్తుండే. కానీ రేవంత్ రెడ్డి కాబట్టి బ్రహ్మాండంగా బ‌తికేస్తుండు. ఇంకా మంచి చేసిన అని డైలాగులు కొడుతుండు అని కేటీఆర్ మండిప‌డ్డారు.

Previous మద్దెల శివకుమార్ భార్య మృతికి సంతాపం తెలియజేసిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వనమా రాఘవ
Next షాద్ నగర్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతర కృషి చేస్తా : షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
ADVERTISEMENT