డైలీ భారత్ ,న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో దేశంలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయనున్నారు. దీనిలో భాగంగా కృత్రిమ మేధ అభివృద్ధికి రూ.500 కోట్లతో మూడు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. విద్య ప్రమాణాలను మెరుగుపర్చడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో మూడు ఎక్సలెన్స్ కేంద్రాలను స్థాపించనున్నట్లు మంత్రి ప్రకటించారు.
#కేంద్రబడ్జెట్2025