| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మద్యం బెల్ట్ షాపులను ఎత్తివేయాలని ఎక్సైజ్ ఆఫీస్ లో మెమొరండం ఇచ్చిన మహిళా మండలి మరియు తుడుం దెబ్బ నాయకులు

మద్యం బెల్ట్ షాపులను ఎత్తివేయాలని ఎక్సైజ్  ఆఫీస్ లో మెమొరండం ఇచ్చిన మహిళా మండలి మరియు తుడుం దెబ్బ నాయకులు


ఏజెన్సీలో  ఏరులై పారుతున్న మద్యం...సోద్యం చూస్తున్న అధికారులు

అధికారులు చర్యలు తీసుకోని ఎడల అన్ని సంఘాలతో కలిసి ఉద్యమం చేస్తాం అంటున్న మహిళ సంఘాలు 

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న బెల్టు షాపులను తిషేయాలని అశ్వరావుపేటలో ఎక్సేంజ్ ఆఫీసులో వినతిపత్రం ఇవ్వడం జరిగినది,మద్యం బెల్ట్ షాపులు 24 గంటలు అందుబాటులో ఉంటున్నవీ అలా ఉండటం వల్ల చాలా మంది యువత పూర్తిగా మత్తుకు బానిస అవుతున్నారని,ఏజెన్సీ ప్రాంతంలో మద్యం నియంత్రణ లేకపోవడం వల్ల యువత రోడ్డు ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నారని,ఈ మధ్యం వల్ల చాలా కుటుంబాలు రోడ్డు పాలు అవుతున్నాయి,తక్షణమే అధికారులు స్పందించి మద్యం బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని,అధికారులు స్పందించకపోతే అన్ని సంఘాలను ఏకం చేసి ఉద్యమం చేయాల్సి వస్తుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా మండలి అధ్యక్షురాలు షేక్ జాన్ బి హెచ్చరించారు,ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ నాయకులు తంబళ్ల రవి, వాసం పోలయ్య,ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.

Previous తెలుగోడి ఆత్మభిమాన ప్రతీక ఎన్టీఆర్
Next మితిమీరిన వేగం ప్రాణాశంకటం --- ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS
ADVERTISEMENT