| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఆర్యవైశ్య యువజన సంఘాల సమాఖ్య ప్రమాణ స్వీకారం

ఆర్యవైశ్య యువజన సంఘాల సమాఖ్య ప్రమాణ స్వీకారం

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా :ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు గందే సురేష్ గుప్తా,యువజన సంఘం అధ్యక్షులుగా దండు రాహుల్ గుప్త ప్రమాణ స్వీకారం చేశారు .ఆదివారం చంపాపేట్ లో రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహా సభ, మహిళ సభ,యువజన సంఘం,వాసవి సేవా దళ రాజకీయ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం మహోత్సవము కార్యక్రమానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా షాద్ నగర్ పట్టణానికి చెందిన గందే సురేష్ గుప్తా షాబాద్ కి చెందిన దండు రాహుల్ గుప్తను సన్మానించారు.ఆర్యవైశ్య రంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా గందే సురేష్ గుప్తా,ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులుగా దండు రాహుల్ గుప్త,కార్యదర్శిగా దోమ నరసింహ, కోశాధికారిగా నీల రవీందర్ ను గణేష్ గుప్త ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్య వైశ్యుల సంక్షేమానికి ,అభివృద్ధికి మనస్ఫూర్తిగా తోడ్పడతానని , సంఘ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారని తెలియజేశారు.

Previous ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి హౌస్‌ అరెస్ట్‌?
Next లాయర్లను లోపలకు అనుమతించకపోవడంతో వెళ్లిపోయిన కేటీఆర్
ADVERTISEMENT