Posted on 2024-09-01 10:45:59
అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు
డైలీ భారత్, మెదక్: అత్యవసరమైతే డయల్ 100 కానీ జిల్లా పోలీస్ కంట్రోల్ రూం నెం 87126 57888 నకు ఫోన్ చేసి పోలీస్ వారి సేవలు పొందండి : ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి
ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాల వలన జిల్లాలోని నదులు,వాగులు, వంకలు, చెరువులు పొంగి ఉదృతంగా ప్రవహిస్తూ రోడ్లపైకి నీరు చేరే అవకాశం ఉన్నది.కావున కాలి నడకన మరియు వాహనాలతో ప్రజలు రోడ్లు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. సెల్ఫీల కోసం ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రదేశాలకు వెళ్లి ప్రమాదాలకు గురి కావద్దని తెలిపారు. జిల్లా పోలీసు యంత్రాంగం ఇతర శాఖలతో కలిసి ఇప్పటికే వర్షాల కారణంగా ప్రమాదకరంగా మారుతున్న రహదారులు మరియు చెరువులు,వాగులు,నదుల వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలియజేసారు.వరదల్లో చిక్కుకుని ఆపదలో ఉన్న వారిని రక్షించడానికి జిల్లా పోలీస్ శాఖ తరపున 24×7 అందుబాటులో ఉండేవిధంగా డిడిఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచడం జరిగిందని తెలిపారు.ప్రజలు ఎవరైనా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లయితే వెంటనే
అత్యవసరమైతే డయల్ 100 కానీ జిల్లా పోలీస్ కంట్రోల్ రూం నెం 87126 57888 నకు ఫోన్ చేసి సమాచారం అందించి పోలీసు వారి సేవలను పొందాలని కోరారు. ప్రమాదాలు వాటిల్లకుండా పోలీసు వారు చేపట్టే చర్యలకు ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. అలాగే మెదక్ జిల్లా వివిధ పోలీసు స్టేషన్ ల పరిధిలో చెరువులు వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్న ప్రాంతాలు
మెదక్ రూరల్ పిఎస్ పరిధి
మక్త భూపతిపూర్ గుట్ట కింద పల్లి తిమ్మానగర్ రాయిన్పల్లి,
హవేలీఘన్పూర్ పిఎస్ పరిధి
దూప్ సింగ్ తండా వాడి,
హవేలీఘనపూర్ చౌట్లపల్లి,
పాపన్నపేట్ పీఎస్ పరిధి
కొంపల్లి చీకోడ్,
టేక్మాల్ పిఎస్ పరిధి
టేక్మాల్ ధనురా మల్కాపూర్ కూసంగి దన్నారం,
రామయంపేట్ పిఎస్ పరిధి
డి ధర్మారం చిట్టోజిపల్లి
తూప్రాన్ పిఎస్ పరిధి
తూప్రాన్ కిస్టాపూర్ తూప్రాన్ గుండ్రెడ్డిపల్లి
శంకరంపేట ఆర్ పిఎస్ పరిధి
ధర్పల్లి సూరారం
కౌడిపల్లి పిఎస్ పరిధి
రాజపేట జాజితాండ
మెదక్ పట్టణ పిఎస్ పరిధి
రాందాస్ ఎక్స్ రోడ్,గాంధీ నగర్
పొంగిపొర్లుతున్న డ్యాములు
పాపన్నపేట పిఎస్ పరిధి
ఏడుపాయల డ్యాం
హవేలీఘన్పూర్ పిఎస్ పరిధి
పోచారం డ్యామ్
మెదక్ రూరల్ పిఎస్ పరిధి
రాయింపల్లి చెరువు
ప్రజలు ఈ విషయాన్ని గమనించి అత్యవసర పరిస్థితులలో తప్ప బయటకు రాకూడదని అలాగే మంజీరా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు అదేవిధంగా వాహనదారులు తమ వాహనాలు తోలేటప్పుడు పైన తెలిపిన రూట్లో వెళ్లకూడదని అట్టి రహదారులు పొంగిపొర్లుతున్నందున ప్రమాదం జరిగే ఆస్కారం ఉన్నందున ఎవరు కూడా ఆ దారులలో వెళ్ళకూడదని పోలీసులు సూచించిన తగు జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా తెలియజేసినారు.
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >