డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మహిళల అణుకువకు భంగం కలిగించడం, అనుచితంగా ప్రవర్తించడం శిక్షార్హమైన నేరం.
ఇలాంటి నేరానికి పాల్పడిన మహ్మద్ కైఫ్ ఫకీర్ అనే వ్యక్తిని ముంబై కోర్టు దోషిగా తేల్చింది.
అతను ఓ మహిళను అసభ్యం గా తాకడమే కాకుండా కన్నుకొట్టాడు.
ఈ కేసు విచారించిన కోర్టు అతడిని దోషిగా నిర్ధారించింది.
అతనికి యావజ్జీవశిక్ష విధించాలని కోర్టు భావించింది.
అతని భవిష్యత్తు గురించి ఆలోచించి రూ.15,000 జరిమానా విధించింది.