| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

"చెరువు" కనిపెట్టాలని పోలీసులకు ఫిర్యాదు

"చెరువు" కనిపెట్టాలని పోలీసులకు ఫిర్యాదు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: తుమ్మల చెరువు జాడ కనిపెట్టాలని రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు అందింది. మహేశ్వరం మండలం తుక్కుగూడలో 8 ఎకరాల్లో తుమ్మల చెరువు ఉండాలని, కబ్జా చేసి వెంచర్లు వేశారని గ్రామస్థులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కబ్జాతో వర్షాకాలంలో పొలంలోని పంటలు మునుగుతున్నాయని పేర్కొన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల చుట్టూ తిరిగి తీవ్రంగా విసిగిపోయామని, పోలీసులైనా చెరువు ఆచూకీ వెతికిపెట్టాలని వారు విజ్ఞప్తి చేశారు.

Previous సీఎం రేవంత్‌ జైలుకు వెళ్లే ప్రమాదం... సీపీఐ నేత నారాయణ హాట్ కామెంట్స్
Next తెలంగాణ వ్యాప్తంగా హైడ్రా తీసుకురావాలి : వాటిని కూల్చేయాలి...కాంగ్రెస్ నేతల విజ్ఞప్తులు
ADVERTISEMENT