| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నేటి నుంచి ద్వాదశ జ్యోతిర్లింగ శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం

నేటి నుంచి ద్వాదశ జ్యోతిర్లింగ  శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ఆర్జిత సేవలు రద్దు.. భారీగా భక్తుల రద్దీ.

డైలీ భారత్, నంద్యాల: నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి

ఈ సంవత్సరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సుమారు 10 లక్షల పైన 11 రోజులపాటు భక్తులు వస్తారని ఈవో పెద్దిరాజు అంచనా వేశారు. అందులో భాగంగా నేటి నుండి 11 వరకు ఆర్జిత సేవలు నిలుపుదల చేసి భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనానికి అనుమతిస్తున్నట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు .

జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములకు మాత్రమే రేపటి నుండి మార్చి 5న సాయంత్రం వరకు ఉచిత స్పర్శ  దర్శనం కల్పిస్తున్నామని అలానే మాలధారణ కలిగిన శివస్వాములకు చంద్రావతీ కల్యాణ మండపం ద్వారా ప్రత్యేక దర్శన క్యూలైన్ ఏర్పాటు చేశామని తెలిపారు. ముఖ్యంగా ట్రాఫిక్ అంతరాయం లేకుండా క్షేత్ర పరిధిలో 11 చోట్ల 38 ఎకరాలలో వాహనాలకు పార్కింగ్ ఏర్పాటు చేశామని చెప్పారు.

Previous ZP ఆఫీస్ లో అగ్ని ప్రమాదం
Next గిట్టుబాటు ధర కల్పించాలంటూ మిర్చి రైతుల ఆందోళన
ADVERTISEMENT