| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మేడారం హుండీ లెక్కింపులో నకిలీ కరెన్సీ నోట్లు

మేడారం హుండీ లెక్కింపులో నకిలీ కరెన్సీ నోట్లు

డైలీ భారత్, హన్మకొండ జిల్లా:మేడారం హుండీ లెక్కింపు ఈరోజు నుంచి కొనసాగిస్తు న్నారు. నాలుగు రోజుల పాటు జరిగిన జాత‌రకు సంబంధించి భ‌క్తులు మొక్కులు చెల్లించుకొని కానుక‌ల‌ను స‌మ‌ర్పించారు. హుండీ లెక్కింపుల్లో న‌కిలీ క‌రెన్సీ నోట్లు రావడం క‌ల‌క‌లం రేపింది. విచిత్ర‌మేమిటంటే న‌కిలీ క‌రెన్సీ పై అంబేద్క‌ర్ చిత్రం ఉండ‌డం గ‌మ‌నార్హం.

మేడారం జాతర హుండీల్లో నకిలీ వంద రూపాయల నోట్లు దర్శనమిచ్చాయి. హన్మకొండ టీటీడీ కళ్యాణ మండపంలో జరుగుతున్న మేడారం జాతరకు సంబంధించిన హుండీల లెక్కింపులో భాగంగా గురువారం మధ్యాహ్నం వరకు తెరిచిన హుండీ లలో అంబేద్కర్ ఫోటోతో ఉన్న 100 రూపాయల కనిపించాయి.

నకిలీ నోట్లను హుండిలలో వేసిన పలువురు భక్తులు నకిలీ కరెన్సీ వెనక అంబే ద్కర్ ఫోటోను కరెన్సీ పై ముద్రించాలని డిమాండ్ చేయడం గమనార్హం . ఇంకా ఎన్ని హుండీలలో ఇలాంటి కరెన్సీ ఉందో వేచి చూడాలి.

Previous అయ్యా రేవంత్ రెడ్డి నా కరెంట్ ను మీ కాంగ్రెస్ నాయకులే కట్ చేయించారు
Next ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనతో పరీక్ష రాయలేక పోయిన విద్యార్థి ఆత్మహత్య
ADVERTISEMENT