| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

చేగుంటలో బి ఆర్ఎస్ పార్టీ కనుమరుగు?

చేగుంటలో బి ఆర్ఎస్ పార్టీ కనుమరుగు?

బి ఆర్ ఎస్ పార్టీ కి కోలుకోని దెబ్బ

రెడ్డిపల్లి సొసైటీ చైర్మన్ మేకల పరమేష్ బి ఆర్ఎస్ పార్టీ కి రాజీనామా

డైలీ భారత్, చేగుంట:దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి  ఇటీవల పార్టీలలో జరిగే పరిణామాలను చూస్తుంటే చాలా బాధ కలుగుతుందని పిఎసిఎస్ చైర్మన్ మేకల పరమేష్ ఈ సందర్భంగా మాట్లాడారు   ఎన్నికలలో కష్టపడి అందరము కలిసి మిమ్మల్ని గెలిపించుకున్నాం . కానీ నేను ఒక చైర్మన్ అయి ఉండి కూడా పార్టీ కార్యక్రమంలో కానీ  ప్రభుత్వ కార్యక్రమాలలో గాని  ఎటువంటి ఆహ్వానము అందటం లేదు అయినా ఓపికతో ఉన్నాను అని అన్నారు. అనంతరం  ఇటీవల  రామాయపల్లి గెస్ట్ హౌస్ లో జరిగిన చేగుంట మండల పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం తో పాటు మండల పార్టీ అధ్యక్ష ఎన్నికకు  నాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు అని విచారం వ్యక్తపరిచారు అదే విధంగా పార్టీ అధ్యక్షుడిని ఎస్సీ .బీసీ . లకు  ప్రాధాన్యత ఇచ్చి మండల అధ్యక్షుని   స్థానం కల్పిస్తారని అనుకున్నాము అని అన్నారు కానీ బీసీ .లకు ఎస్సీ.లకు పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని ఆరోపించారు. అంద్దుకు మనస్థాపం చెంది పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని పిఎసిఎస్ సొసైటీ చైర్మన్ మేకల పరమేష్ తెలిపారు.

Previous పాకిస్తాన్ ప్రధానమంత్రిగా షహబాజ్ షరీఫ్?
Next 17 ఏండ్ల జైలు జీవితం అనంతరం.. స్వదేశానికి
ADVERTISEMENT