| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మెతుకుల మౌనంలో మానవత్వపు రాగం—మంజుల పత్తిపాటి

మెతుకుల మౌనంలో మానవత్వపు రాగం—మంజుల పత్తిపాటి

డైలీ భారత్ స్పెషల్:

మెతుకుల మౌనంలో మానవత్వపు రాగం

ఒకచోట విందులు వినోదాలు..

 మరోచోట ఆకలి కేకలు..!

ఒకచోట బువ్వ వృథాలు…

మరోచోట పిడికెడు అన్నం కోసం ఎదురుచూపులు..!

ప్రపంచ ఆహార దినోత్సవం వేడుకలు జరుపుతుంటే 

గిన్నెలో మిగిలిన మెతుకులు చెత్తపాలవుతుంటే,

పిడికెడు అన్నం కోసం ప్రాణం విలవిలలాడుతుంటే

ఎక్కడ ఉంది మానవీయత..?

అమ్మ చేతి వంట తింటున్న మనం 

ఆకలి మంటల్లో కాలిపోతున్న వారిని మరచిపోతుంటే

ఎక్కడ ఉంది సహృదయత..?

మెతుకు విలువ తెలుసుకుందాం..!

మరొకరి ఆకలి తీర్చి మానవత్వం చాటుకుందాం..!

 భక్తాన్ని పంచె వాడు  దేవుడే సుమీ..!

అన్నదాత అరుకాలం కష్టపడి పండించిన ఆహారాన్ని 

వృదా చేయకుండా ప్రతి మెతుకు ఆకలి మంటలను 

చల్లార్చు వాడు ఈ అవనిపై నడిచే దేవుడే సుమీ..!

ప్రపంచ ఆహార దినోత్సవం అక్టోబరు 16 నాటి వేడుకల్లో 

ఆకలి కేకలు అంతమొందాలని కోరుకుంటూ…


రచన: మంజుల పత్తిపాటి 

 చరవాణి   9347042218

మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్.

యాదాద్రి భువనగిరి జిల్లా

తెలంగాణ రాష్ట్రం.

Previous లైంగిక వేధింపుల ఆరోపణలు... JNU ప్రొఫెసర్, కాంగ్రెస్ ఎంపీ అంగోంచా బిమోల్ అకోయిజంపై కేసు నమోదు
ADVERTISEMENT