| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మగ్గం మాట్లాడుతోంది..!

మగ్గం మాట్లాడుతోంది..!

సిరిసిల్ల కలెక్టరేట్ జంక్షన్లో "నేత బతుకు "చిత్రాలు. 

సిరిసిల్ల ప్రత్యేకతను చాటుతున్న దృశ్యాలు.

ప్రారంభానికి సిద్ధం.

డైలీ భారత్, సిరిసిల్ల:  అవును మగ్గం మాట్లాడుతోంది. తరాల వారసత్వంగా వస్తున్న నేత వృత్తిని నమ్ముకున్న ఓ ఊరి కథను దృశ్యరూపాలుగా ఆవిష్కరిస్తున్న సందర్భం చూసేందుకు సిరిసిల్ల ప్రేమతో పిలుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ జంక్షన్ లో  అరుదైనలో  సిరిసిల్ల నేతన్నల  బతుకు చిత్రాలను ఆవిష్కరించి ప్రేమగా మీతో మాట్లాడేందుకు సిద్ధమవుతోంది.  ఎన్నో కళారూపాలకు ఊపిరి పోసిన సిరిసిల్ల చేనేత కళాకారుల ప్రతిభను కళారూపాలలో జీవం ఉట్టిపడేలా ఆవిష్కరించి కలెక్టర్ జంక్షన్ లో ఏర్పాటు చేశారు. సిరిసిల్ల నేత కార్మికుల జీవనంలో భాగమైన వృత్తి లోని దృశ్యాలను కళారూపాలు మలిచి జోట ప్రతిమ ఒక్కటే కాదు. నేత వృత్తిలోని జీవితాన్ని ఆవిష్కరించేలా కళారూపాలు కలెక్టరేట్ జంక్షన్ లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇది తుదిమెరుగులు దిద్దుకుని ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. కేవలం కళ రూపాలు గానే కాకుండా సిరిసిల్ల నేతన్నల జీవితాన్ని ఆవిష్కరించిన ప్రతిమల ఏర్పాటు చేయడం పట్ల ప్రభుత్వానికి సిరిసిల్ల నేతన్నలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. సిరిసిల్ల నేతన్నల మగ్గం ప్రేమతో ఆప్యాయంగా మిమ్మల్ని అలింగనం చేసుకునేందుకు ఎదురుచూస్తోంది..

_________

అల్లే రమేష్ సిరిసిల్ల.

Previous విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలీ...బిజెపి పార్టీ డిమాండ్
Next వెంకటసాయి నగర్‌ కాలనీ లో పెండింగ్ లో ఉన్న సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు విజయేందర్ రెడ్డి
ADVERTISEMENT