Posted on 2026-05-27 18:38:06
వ్యాస కర్త: ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నంచందర్, సిరిసిల్ల, TPA రాష్ట్ర ఉపాధ్యక్షుడు
MSc Psychology, MSW Medical & Psychiatry, LLB
(తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక (12)వ్యాసం)
డైలీ భారత్, స్పెషల్:
“మీలో కోపం అదుపు తప్పుతుందా..?”
చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా కోపం వస్తుందా..?
కోపంలో ఏమి మాట్లాడుతున్నారో మీకే తెలియకుండా పోతుందా..?
తర్వాత పశ్చాత్తాపపడుతున్నారా..?
కుటుంబ సభ్యులు “నీ కోపం చాలా ఎక్కువ” అంటున్నారా..?
"ఐతే ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేయకండి"
ప్రస్తుత సమాజంలో చిన్న చిన్న విషయాలకే కోపం పెరగడం, ఆవేశంతో స్పందించడం, కుటుంబాలలో గొడవలు, రోడ్లపై ఘర్షణలు, సోషల్ మీడియాలో ద్వేషపూరిత వ్యాఖ్యలు వంటి సంఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. చాలామంది కోపాన్ని ఒక సాధారణ స్వభావంగా భావిస్తారు. కానీ కోపం అనేది కేవలం ఒక భావోద్వేగం మాత్రమే కాదు; అది మన ఆలోచనలు, ఆరోగ్యం, సంబంధాలు మరియు జీవితంపై ప్రభావం చూపే ఒక మానసిక ప్రతిస్పందన.
"కోపం ఒక సహజ భావోద్వేగం"
ఆనందం, బాధ, భయం లాగే కోపం కూడా సహజమైన భావోద్వేగమే. అయితే అది నియంత్రణలో ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగకరంగా ఉంటుంది. నియంత్రణ కోల్పోయిన కోపం వ్యక్తిగత జీవితాన్ని మాత్రమే కాకుండా కుటుంబాలను, సంబంధాలను మరియు సమాజాన్ని కూడా దెబ్బతీయగలదు. అందువల్ల కోపాన్ని అర్థం చేసుకోవడం మరియు దాన్ని ఆరోగ్యకరంగా నియంత్రించడం ప్రతి ఒక్కరికీ అవసరం.
కోపం సాధారణంగా మన ఆశలు నెరవేరనప్పుడు, అవమానం ఎదురైనప్పుడు, మనకు అన్యాయం జరిగినట్లు అనిపించినప్పుడు వస్తుంది. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఒత్తిడులు, ఉద్యోగ సమస్యలు, ప్రేమ విఫలాలు, అసూయ, అనుమానాలు, నిద్రలేమి, మానసిక ఒత్తిడి, బాల్య అనుభవాలు వంటి అనేక కారణాలు కోపానికి దారితీస్తాయి. కొంతమంది తమ బాధను బయటపెట్టలేక కోపం రూపంలో వ్యక్తపరుస్తారు. అంటే చాలాసార్లు కోపం వెనుక అసలు భావోద్వేగం బాధ, భయం లేదా అసహాయత అయి ఉండవచ్చు.
"కోపంలో హార్మోన్ల ప్రతిస్పందన"
కోపం వచ్చినప్పుడు మన శరీరం “Fight or Flight Response” అనే అత్యవసర ప్రతిస్పందనలోకి వెళుతుంది. అంటే ప్రమాదాన్ని ఎదుర్కోవాలా లేక దూరంగా వెళ్లాలా అనే రక్షణాత్మక స్థితిలోకి శరీరం మారుతుంది. ఈ సమయంలో Adrenaline, Cortisol వంటి Stress Hormones విడుదలవుతాయి. గుండె వేగంగా కొట్టుకోవడం, రక్తపోటు పెరగడం, శ్వాస వేగంగా మారడం, చెమటలు పట్టడం, కండరాలు బిగుసుకుపోవడం వంటి మార్పులు కనిపిస్తాయి. కోపం ఎక్కువకాలం కొనసాగితే హై బీపీ, గుండె సమస్యలు, నిద్రలేమి, Anxiety, Depression వంటి సమస్యలు కూడా రావచ్చు.
"బ్రెయిన్ ఎలా స్పందిస్తుంది?"
మెదడులో కూడా కోపం సమయంలో అనేక మార్పులు జరుగుతాయి. భావోద్వేగాలను నియంత్రించే “Amygdala” భాగం అత్యంత వేగంగా స్పందిస్తుంది. అదే సమయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకునే “Prefrontal Cortex” పనితీరు తగ్గుతుంది. అందువల్ల కోపంలో ఉన్న వ్యక్తి ఆలోచించకుండా మాట్లాడటం, హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోవడం లేదా హింసాత్మకంగా ప్రవర్తించడం జరుగుతుంది. అందుకే కోపంలో తీసుకున్న నిర్ణయాలు తర్వాత పశ్చాత్తాపానికి దారి తీస్తాయి.
"Brust Out అంటే?"
కోపం నియంత్రణ కోల్పోయినప్పుడు “Burst Out Stage” అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమయంలో వ్యక్తి అరిచేయడం, వస్తువులు విసరడం, దూషించడం, కొట్టడం లేదా తీవ్ర ఆవేశ ప్రవర్తనకు దిగడం జరుగుతుంది.
కొన్ని క్షణాల కోపం జీవితాంతం బాధ కలిగించే పరిస్థితులకు దారి తీస్తుంది. కుటుంబ విభేదాలు, సంబంధాల వైఫల్యం, హింసాత్మక ఘటనలు, చట్టపరమైన సమస్యలు కూడా ఇలాంటి ఆవేశ ప్రవర్తన వల్లనే ఏర్పడుతాయి.
కోపం ప్రభావం కేవలం ఒక వ్యక్తిపైనే కాదు, చుట్టూ ఉన్న వారిపైనా తీవ్రంగా పడుతుంది. ఎప్పుడూ కోపంగా ఉండే వ్యక్తుల కుటుంబాలలో భయం మరియు అభద్రత భావన పెరుగుతుంది. పిల్లల్లో ఆందోళన పెరుగుతుంది. కొందరు పిల్లలు భయపడే స్వభావాన్ని అలవరుచుకుంటే, మరికొందరు అదే కోపాన్ని అనుకరిస్తారు. ఉద్యోగాలలో కూడా కోపం కారణంగా సంబంధాలు దెబ్బతిని అవకాశాలు కోల్పోయే పరిస్థితులు వస్తాయి.
"మానసిక సమస్యల్లో కోపం ఒక ముఖ్య లక్షణం"
చాలా మానసిక సమస్యల్లో కూడా కోపం ఒక ముఖ్య లక్షణంగా కనిపిస్తుంది. Depression, Anxiety Disorders, Bipolar Disorder, Personality Disorders, Substance Abuse Disorders వంటి సమస్యల్లో తీవ్రమైన కోపం కనిపించవచ్చు. సాధారణ కోపం కొంతసేపటికే తగ్గిపోతుంది. కానీ అసాధారణ కోపం చిన్న విషయానికే తీవ్రమై ఎక్కువసేపు కొనసాగుతుంది. కొన్నిసార్లు వ్యక్తి నియంత్రణ పూర్తిగా కోల్పోతాడు.
"సైకాలజిస్టుల సాయం పొందడానికి వెనుకాడవద్దు"
వ్యక్తి కోపాన్ని సరైన దారిలో పెట్టి వ్యక్తిత్వ వికాసం వైపు నడిపించడంలో సైకాలజిస్టు పాత్ర చాలా కీలకం. సైకాలజిస్టు కోపానికి కారణమయ్యే ఆలోచనలు, భావోద్వేగాలు, ప్రవర్తనలను విశ్లేషించి వ్యక్తికి సరైన మార్గదర్శనం చేస్తాడు.
ముఖ్యంగా Cognitive Behaviour Therapy (CBT), Anger Management Therapy, Relaxation Therapy, Behaviour Therapy, Mindfulness Techniques వంటి థెరపీలు కోప నియంత్రణలో ఎంతో ఉపయోగపడతాయి. వ్యక్తికి భావోద్వేగ నియంత్రణ, Stress Management, Communication Skills వంటి అంశాలను కూడా నేర్పిస్తారు.
"అవసరమైతే సైకియాట్రిస్ట్ ను కలవాలి"
మానసిక వ్యాధి గ్రస్థులలో కోపం ఒక లక్షణంగా ఉంటుంది. కోపం తీవ్రమై మానసిక వ్యాధులతో కలసి ఉన్నప్పుడు సైకియాట్రిస్ట్ పాత్ర చాలా ముఖ్యమవుతుంది. సైకియాట్రిస్ట్ అవసరమైతే మందులు సూచించి Anxiety, Bipolar Disorder, Psychosis వంటి సమస్యలకు చికిత్స అందిస్తారు. సైకాలజిస్టు మరియు సైకియాట్రిస్ట్ కలిసి పనిచేసినప్పుడు వ్యక్తికి సమగ్ర చికిత్స అందుతుంది.
"కోపాన్ని సానుకూల శక్తిగా మార్చుకోవడానికి మార్గాలు"
కోపం వచ్చిన వెంటనే స్పందించకుండా కొంత సమయం తీసుకోవాలి.
లోతుగా శ్వాస తీసుకోవడం, నీరు తాగడం, కొద్దిసేపు ఆ ప్రదేశం నుంచి దూరంగా ఉండడం మంచిది.
“నాకు నిజంగా ఎందుకు కోపం వచ్చింది?” అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.
కోపాన్ని అరుపుల్లో కాకుండా పనిలో, లక్ష్యాల్లో, కృషిలో చూపించాలి.
వ్యాయామం, ధ్యానం, యోగా వంటి అలవాట్లు కోప నియంత్రణకు సహాయపడతాయి.
నమ్మకమైన వ్యక్తులతో మాట్లాడటం వల్ల మనసులోని ఒత్తిడి తగ్గుతుంది.
ఎక్కువసార్లు కోపం వెనుక బాధ, నిరాశ, ఒత్తిడి, గుర్తింపు లేకపోవడం వంటి కారణాలు దాగి ఉంటాయి. అందుకే కోపాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం. ప్రతి కోపానికి హింస అవసరం లేదు. ప్రశాంతంగా తీసుకున్న నిర్ణయం జీవితాన్ని మార్చేస్తుంది.
"చరిత్రలో ఎన్నో గొప్ప మార్పులు కూడా ఒక సానుకూల కోపంతోనే ప్రారంభమయ్యాయి." అన్యాయం మీద కోపం ఉన్నవారే సమాజంలో మార్పు తీసుకువచ్చారు. కాబట్టి కోపాన్ని నాశనానికి ఉపయోగిస్తే అది ప్రమాదం, అభివృద్ధికి ఉపయోగిస్తే అది విజయం.
కోపాన్ని ఆరోగ్యకరమైన రీతిలో మలచడంలో సైకాలజిస్టు ఒక స్నేహితుడిగా, మార్గదర్శకుడిగా, నాయకుడిగా మిమ్మల్ని ముందుండి నడిపిస్తాడు.
Visit Us:
Sanjana Clinic
(Neuro Psychiatric & Counseling Center)
Shiva nager khaman, Main Road, Sircilla
దేశ సరిహద్దులకు 15 కి.మీ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలు కూల్చేయాలి : అమిత్ షా
Posted On 2026-05-27 18:46:07
Readmore >
ఖమ్మం : హైడ్రాలిక్, ఎలక్ట్రో - మెకానికల్ వెహికల్ లిఫ్టర్‌ను ప్రారంభించిన పోలీస్ కమిషనర్
Posted On 2026-05-27 16:58:02
Readmore >
ఇందిరా మహిళా శక్తి భవనాలను సభ్యులు సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-27 16:43:06
Readmore >
అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండి ధాన్యం రక్షణ చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-05-27 16:39:20
Readmore >
కొనుగోళ్ళు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-27 16:35:33
Readmore >
వివోఏల నిరవధిక సమ్మెకు బిఆర్ఎస్ నేత ఏనుగు మనోహర్ రెడ్డి సంఘీభావం...
Posted On 2026-05-27 16:31:01
Readmore >