| Daily భారత్
Logo


తెలంగాణలో మరో భారీ స్కామ్....ఐదు వేల సిఎంఅర్ఎఫ్ చెక్కులు మిస్సింగ్

News

Posted on 2024-03-28 08:44:47

Share: Share


తెలంగాణలో మరో భారీ స్కామ్....ఐదు వేల సిఎంఅర్ఎఫ్ చెక్కులు మిస్సింగ్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: పేదలకు అందే సీఎంఆర్ఎఫ్ చెక్కుల్లో భారీగా అవకతవకలు జరిగినట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి ప్రభుత్వం సుమారు 10 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంజూరు చేసింది. కానీ అందులో 5 వేల చెక్కులు మాత్రమే బ్యాంకుల ద్వారా డ్రా అయ్యాయి. మిగతావి బ్యాంకులకు రాకపోవడంతో అవన్నీ ఏమయ్యాయనేది మిస్టరీగా మారింది. ఇదే విషయంపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. డ్రా అయిన చెక్కుల విషయంలో అక్రమాలు జరిగినట్టు ఆఫీసర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

హరీశ్‌రావు ఆఫీసు ఉద్యోగి అరెస్టుతో అనుమానాలు..

బీఆర్ఎస్ హయాంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో అనేక అక్రమాలు జరిగినట్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు వస్తున్నాయి. అందులో భాగంగానే వచ్చిన కంప్లయింట్ మేరకు మాజీ మంత్రి హరీశ్‌రావు ఆఫీసు ఉద్యోగి అనేక సీఎంఆర్ఎఫ్ చెక్కులను అక్రమంగా డ్రా చేసినట్టు అధికారులు గుర్తించారు. బుధవారం అతన్ని అరెస్టు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మంజూరు చేసిన చెక్కులు ఎన్ని? అందులో ఎన్ని డ్రా అయ్యాయి? అనే విషయంపై అధికారులు ఆరా తీయగా 5 వేల చెక్కులు డ్రా కాలేదనే విషయం బయటకు వచ్చింది. మరి ఆ చెక్కులు ఎందుకు డ్రా కాలేదు? లబ్ధిదారులకు వాటిని ఇచ్చారా? లేదా? అని ప్రభుత్వ వర్గాలు ఆరా తీస్తున్నాయి.

మాజీ ఎమ్మెల్యేల వద్దా? లేక వారి పీఏలు, ఓఎస్టీల వద్దా?

వైద్య చికిత్స కోసం నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తుంది. అందుకు బాధితుడు నేరుగా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు లేదు. స్థానిక ఎమ్మెల్యే సిఫారసు లెటర్‌తో మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. సాంక్షన్ అయిన చెక్కులను సైతం ప్రభుత్వం నేరుగా లబ్ధిదారులకు అందించదు. దరఖాస్తును సిఫారసు చేసిన ఎమ్మెల్యేలకు మాత్రమే వీటిని అంజేస్తుంది. ప్రభుత్వం నుంచి చెక్కులు మంజూరు కాగానే వాటిని తీసుకునేందుకు ఎమ్మెల్యేలకు వీలుపడనప్పుడు వారి పీఏ, ఓఎస్టీలను సెక్రటేరియట్‌కు పంపించి చెక్కులు కలెక్ట్ చేసుకోవాలని ఆదేశిస్తుంటారు. అనంతరం వీలును బట్టి వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేస్తుంటారు.

ఇందుకు సంబంధించి సీఎంఆర్ఎఫ్ విభాగంలో ప్రతి ఎమ్మెల్యే సిఫారసు చేసిన దరఖాస్తులు, సాంక్షన్ చేసిన చెక్కుల వివరాలను పక్కాగా నమోదు చేస్తారు. తాజాగా అధికారులు వాటిని పరిశీలించగా సుమారు 5 వేల చెక్కులు డ్రా కాలేదని తెలిసింది. ఎన్నికల ముందు జారీ చేసిన చెక్కులు ఇంకా మాజీ ఎమ్మెల్యేల వద్దే ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాటిని లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వలేదని నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. సమయం లేకపోవడం వల్లే పంపిణీ చేయలేదా అంటూ డౌట్ పడుతున్నారు. మరో వైపు డ్రా అయిన వాటిల్లోనూ మాజీల పీఏలు, ఆఫీసు ఉద్యోగులు హరీశ్‌రావు ఆఫీసు ఉద్యోగి తరహాలో బినామీ పేర్లతో స్వాహా చేశారా? అనే కోణంలోనూ వివరాలు సేకరిస్తున్నట్టు తెలిసింది.

ఓట్లు వేయలేదని కోపంతో కొందరు..?

ప్రజల తమకు ఓట్లు వేయకుండా ఓడించారని మెజార్టీ మంది మాజీ ఎమ్మెల్యేలు కోపంతో ఉన్నారని, అందులో భాగంగానే సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు ఇవ్వడం లేదని ఫిర్యాదులు సైతం వస్తున్నాయి. చెక్కుల కోసం మాజీ ఎమ్మెల్యేల ఇంటికి వెళితే దుర్బాషలాడుతున్నారని, తిట్టి వెనక్కి పంపుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ‘మీ గ్రామంలో నాకు మెజార్టీ రాలేదు, నీకు చెక్కు ఇవ్వను’ అని మొహం మీదే చెబుతున్నారని కొందరు బాధితులు స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తున్నది.

Image 1

ఘోర రోడ్డు ప్రమాదం

Readmore >
Image 1

భార్య పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న కలెక్టర్ గన్ మెన్

Readmore >
Image 1

ఏసీబీ చిక్కిన పోలీస్ స్టేషన్‌ రైటర్

Readmore >
Image 1

ప్రేమజంట ఆత్మహత్య?

Readmore >
Image 1

ఇంటి పెద్దను హతమార్చిన భార్య, కూతురు

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం: డ్రైవర్ మృతి

Readmore >
Image 1

అటెండర్‌తో బూట్లు మోపించిన జిల్లా కలెక్టర్

Readmore >