| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి

నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి

తీవ్ర గాయాలు.. వరుస ఘటనలతో బెంబేలెత్తుతున్న ప్రజలు

 డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వీధి కుక్కల స్వైర విహారం విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. ఎక్కడపడితే అక్కడ రోడ్డున వెళ్లే వారి వెంటపడి దాడి చెయ్యడమే కాకుండా చిన్నారులను సైతం తీవ్ర గాయాలపాలు చేస్తున్న ఘటనలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా నగర శివారులోని  పాంగ్ర సమీపంలో చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేశాయి. దీంతో కుటుంబీకులు బాలుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇది మర్చిపోకముందే మరో ఘటనమాధవ్ నగర్ లో గగన్ అనే నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కలుదాడి తీవ్రంగా గాయాల పాలు చేశాయి. వీధికుక్కల నియంత్రణ కోసం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నప్పటికీ మున్సిపల్ కమిషనర్, సంబంధిత ఉన్నతాధికారులు సరైన నిఘా పెట్టకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Previous ఉధృతంగా ప్రవహిస్తున్న శ్రీరామ్ సాగర్ వరద నీరు
Next దేశం గర్వించదగ్గ నాయకుడు మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి
ADVERTISEMENT