| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

స్కాన్ చేయండి పోలీసు సేవలపై మీ,మీ అభిప్రాయాలను తెలపండి.

స్కాన్ చేయండి పోలీసు సేవలపై మీ,మీ అభిప్రాయాలను తెలపండి.

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా:క్యూఆర్‌ కోడ్‌ ఆఫ్ సిటిజెన్ పోస్టర్లను డిజిపికార్యాలయంలో డీజీపీ డాక్టర్ జితేందర్ ఐపీఎస్. ప్రారంభించగా,పోలీస్ ఉన్నత అధికారులతో కలసి పాల్గొన్న జిల్లా ఎస్పీ

రాష్టంలో పోలీసుల పనితీరు, పోలీసులపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను తెలుసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పోలీసు శాఖ రూపొందించిన క్యూఆర్‌ కోడ్‌ ఆఫ్ సిటిజెన్ పోస్టర్లను ఈ రోజు డీజీపీ కార్యాలయం హైదరాబాదు నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీ లతో డీజీపీ డాక్టర్ జితేందర్ క్యూఆర్‌ కోడ్‌ ఆఫ్ సిటిజెన్ పోస్టర్లను లాంఛనంగా ప్రారంభించారు. 

బాధితులు సమస్యలు విన్నవించేందుకు పోలీస్‌స్టేషన్లకు వెళ్లిన అనంతరం పోలీసు సిబ్బంది వ్యవహరించిన తీరు, ఫిర్యాదులు మొదలు పాస్‌పోర్ట్ వేరిఫికేషన్,ఈ - చలాన్,ఎఫ్ ఐ ఆర్, ఇతర సేవల గురించి పోలీస్ సిబ్బందిపై ప్రజలకు ఉన్న అభిప్రాయాలను సేకరించేందుకు క్యూఆర్‌కోడ్‌ అందుబాటులో తీసుకొని రావడం జరిగిందని,ఈ పోస్టర్లు పోలీస్ కమిషనర్ కార్యాలయంతో పాటు అన్ని పోలీస్ స్టేషన్లు, సర్కిల్ ఇన్స్‌పెక్టర్, ఏసీపీ కార్యాలయల్లో స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...

జిల్లా పోలీస్ కార్యాలయంలో తో పాటు సబ్ డివిజన్ కార్యాలయల్లో, సర్కిల్ కార్యాలయల్లో,అన్ని పోలీస్ స్టేషన్లలో  అందుబాటులో వుండే విధంగా క్యూఆర్‌ కోడ్‌ ఆఫ్ సిటిజెన్ పోస్టర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ,దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోని పోలీస్ సేవలపై  సలహాలు ,సూచనలు ఇవ్వాలని సూచించారు.

పోస్టర్ నందు గల క్యూఆర్‌కోడ్‌ లేదా https://qr.me-qr.com/aZMTxHDm లింక్ ద్వారా ఓపెన్ చేసి అందులో చూపిన విధంగా సలహాలు సూచనలు ఇవ్వాలని ఎస్పీ గారు తెలిపారు.

Previous వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Next "సంక్రాంతి" ప్రయాణికులపై "ప్రత్యేక" భారం
ADVERTISEMENT