| Daily భారత్
ADVERTISEMENT
Home / News / Devotional

చిన్నశేష వాహనంపై యోగముద్రలో బద్రీనారాయణ అలంకారంలో శ్రీ మలయప్ప

చిన్నశేష వాహనంపై యోగముద్రలో బద్రీనారాయణ అలంకారంలో శ్రీ మలయప్ప

డైలీ భారత్, తిరుపతి: శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన సోమవారం ఉదయం శ్రీమలయప్పస్వామివారు శంఖుచక్రాలతో యోగముద్రలో బద్రీనారాయణ అలంకారంలో ఐదు తలల చిన్న శేషవాహనంపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు.

చిన్న‌శేష వాహనం - కుటుంబ శ్రేయస్సు

పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకి(నాగ‌లోకానికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే కుటుంబ శ్రేయ‌స్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.

Previous అక్రమంగా తరలిస్తున్న భారీ నగదును సీజ్ చేసిన నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ ,
Next సిరిసిల్లలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం
ADVERTISEMENT