| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మానవత్వం చాటుకున్న ఏపీ హోంమంత్రి తానేటి వనిత

మానవత్వం చాటుకున్న ఏపీ హోంమంత్రి తానేటి వనిత

డైలీ భారత్, పశ్చిమగోదావరి జిల్లా:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత ఈరోజు నల్లజర్ల మండలం పర్యటనలో భాగంగా గౌరీపట్నం వెళ్తున్న క్రమంలో మార్గ మధ్యలో దుద్దుకూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక ద్విచక్ర వాహన దారుడికి తీవ్ర గాయాలయ్యాయి.

అటుగా వెళుతున్న తానేటి వనిత వెంటనే కాన్వాయ్ ఆపి క్షతగాత్రుడుని పరా మర్శించారు. కంగారు పడాల్సిన అవసరం లేదని అతనికి దైర్యం చెప్పారు. 

తన వ్యక్తిగత సిబ్బంది, భద్రతా సిబ్బందితో క్షతగాత్రుని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలని ఆదేశించారు.

అనంతరం క్షతగాత్రుడు లింగాల వెంకట్రావు దుద్దుకూరు కు చెందిన క్వారీలో పనిచేసే వ్యక్తిగా గుర్తించారు.  హోం మంత్రి చూపిన మానవత్వం పట్ల పలువురు ఆమెను అభినందిస్తున్నారు.

Previous జై తెలంగాణ అన్నందుకు పోలీసులు కొడతారా?: మాజీ మంత్రి కేటీఆర్
Next పరీక్షకు వెళుతుండగా రోడ్డు ప్రమాదం గాయాలతోనే పరీక్ష రాసిన విద్యార్థిని
ADVERTISEMENT