బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారకరామారావు.
పార్టీని క్షేత్రస్థాయిలో బలంగా నిర్మించుకుందాం.
బిజెపిని అడ్డుకునే శక్తి కాంగ్రెస్ కు లేదు.
బిజెపిని వ్యతిరేకించే వామపక్షవాదులు కలిసి రావాలి.
సిరిసిల్ల నేతన్నలు భయపడొద్దు.
నియోజకవర్గ టిఆర్ఎస్ సర్వసభ్య సమావేశం.
డైలీ భారత్,సిరిసిల్ల: అధికారం మాత్రమే పోయిందని పోరాట పటిమ అలాగే ఉందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఆదివారం సిరిసిల్ల నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం తెలంగాణ భవన్ లో జరిగింది. కార్యక్రమానికి హాజరైన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు కార్యకర్తలను నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా దాటవేస్తే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. రైతులు పడుతున్న ఇబ్బందుల తక్షణమే ప్రభుత్వం స్పందించాలని అన్నారు. హామీల అమలు కోసం వంద రోజులు గడువు కోరిన కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయని పక్షంలో ఎక్కడికక్కడ నిలదీస్తామని అన్నారు.
రూలింగ్ లో ఉన్నప్పటి కంటే ప్రతిపక్షంలోనే కెసిఆర్ డేంజర్ అని ప్రజలపక్షణ గొంతు వినిపిస్తామని అన్నారు. నియోజకవర్గంలో కొంతమంది నాయకులు పార్టీని విడిపోతే నష్టమేమీ లేదని ఒకరు పోతే పదిమందిని తయారు చేస్తామని కార్యకర్తలు అధైర్య పడోద్దని అన్నారు. ప్రజలను నిందించవద్దని ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష పాత్రలో సమస్యలపై పని చేయాల్సి ఉందని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి వినోద్ కుమార్ గెలుపు కోసం కష్టపడాలని అన్నారు. తర్వాత వచ్చే ఎన్నికల్లో మీకోసం మీకంటే ఎక్కువగా నేను కష్టపడతానని తెలిపారు.
సిరిసిల్ల నేతన్నలు అధైర్య పడవలసిన పనిలేదని కాంగ్రెస్ పార్టీ బెదిరింపులకు భయపడోద్దని 39 మంది శాసనసభ్యులు బిఆర్ఎస్ పార్టీ పక్షాన అండగా ఉంటామని ప్రభుత్వాన్ని సమస్యల విషయంలో నిలదీసి ప్రశ్నిస్తామని తెలిపారు. నియోజకవర్గంలో బిజెపిని వ్యతిరేకించే శక్తులు,వామపక్షాలు బిఆర్ఎస్ తో కలిసి రావాలని కోరారు.
కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ సిరిసిల్ల నియోజకవర్గానికి ఒక్క బడి ,గుడి తీసుకొచ్చిన పరిస్థితి లేదని విమర్శించారు. జాతీయస్థాయిలోను కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమిని వదిలి పార్టీలు వెళ్లిపోతున్నాయని తెలిపారు. భారత రాష్ట్ర సమితిని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తామని పనిచేసే వారికి ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.