| Daily భారత్
Logo


అంతరాష్ట్ర ముఠాను పట్టుకున్న పోలీసులు

News

Posted on 2024-01-18 19:33:04

Share: Share


అంతరాష్ట్ర ముఠాను పట్టుకున్న  పోలీసులు

డైలీ భారత్, చేగుంట: మెదక్ జిల్లా నూతన పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ డా .బి.బాలస్వామి  చేగుంట పోలీస్ స్టేషన్ కి సంబందించిన క్రైమ్ నంబర్ 16/2024 U/S 379 IPC కేసులో నిందితులను పట్టుకుని విచారించి మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లా, సిద్దిపేట జిల్లా, సైబరాబాద్ కమిషనరేట్ పరిది లలో సెల్ టవర్ లకు సంబంధించిన మెటీరియల్స్ దొంగతనాలకు పాల్పడ్డ నేరస్థుల వివరాలను తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా.బి.బాలస్వామి మాట్లాడుతూ..... గత సంవత్సరం సెప్టెంబర్ నెల చివరి వారంలో నేరస్థులు రామంతాపూర్ గ్రామ శివారు లోని సెల్ టవర్ లకు సంబంధించిన మెటీరియల్స్ ఎయిర్ టెల్ (Base Band Unit) దొంగతనాలకు పాల్పడినారని అంతటితో ఆగకుండా ఈ నేరస్థులు జిల్లాలో వరుసగా సెల్ టవర్ లకు సంబంధించిన మెటీరియల్స్ (Base Band Unit) దొంగతనాలకు పాల్పడ్డారని ఇట్టి కేసును ఛాలెంజ్ గా తీసుకుని జిల్లా సిబ్బందిని జిల్లా అదనపు ఎస్.పి అడ్మిన్ .ఎస్ మహేందర్, డి.ఎస్.పి తూప్రాన్ .యాదగిరి రెడ్డి గార్ల ఆద్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి వారిని పట్టుకోవడం జరిగింది అని అన్నారు. ప్రదాన నేరస్థుడు మాసిని మహేష్ తండ్రి రాములు వయస్సు 28 సంవత్సరంలు కులం పద్మశాలి వృత్తి బొల్లారంలోని ఎం.జి లాజిస్టిక్ లో ట్రాన్స్పోర్ట్ కోఆర్డినేటర్, నివాసం వెంకంపల్లి గ్రామం, నాగిరెడ్డిపేట మండలం కామారెడ్డి జిల్లా తాను జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశ్యంతో  11 మంది ఒక ముఠా గా ఏర్పడి సెల్ టవర్ లకు సంబందించిన BBU (Base Band Unit) దొంగతనాలకు పాల్పడినారని  అన్నారు.

నేరస్థుల వివరాలు 

1. మాసిని మహేష్ తండ్రి రాములు వయస్సు 28 సంవత్సరాలు కులం పద్మశాలి వృత్తి బొల్లారంలోని ఎం.జి లాజిస్టిక్ లో ట్రాన్స్పోర్ట్ కోఆర్డినేటర్, నివాసం వెంకంపల్లి గ్రామం, నాగిరెడ్డిపేట మండలం కామారెడ్డి జిల్లా

2. కైదాపూర్ సంతోష్ రెడ్డి తండ్రి సిద్దిరామ్ రెడ్డి వయసు 28 సంవత్సరాలు కులం రెడ్డి వృత్తి కంస్ట్రక్షన్ వర్క్ నివాసం తాండూర్ గ్రామం, నాగిరెడ్డిపేట మండలం కామారెడ్డి జిల్లా

3. గోవ్వూరి రత్నాకర్ రెడ్డి తండ్రి నర్సా రెడ్డి వయసు 30 సంవత్సరాలు కులం రెడ్డి వృత్తి కంస్ట్రక్షన్ వర్క్ సైట్ ఇంచార్జ్  నివాసం స్రినివస కాలనీ కామారెడ్డి జిల్లా ప్రస్తుతం  వినాయక నగర్ మేడ్చల్

4. కర్రోల్ల రాజా గౌడ్  తండ్రి మల్లా గౌడ్  వయసు 29 సంవత్సరాలు కులం గౌడ్  వృత్తి హోటల్ నివాసం రాఘవ పల్లి  నాగిరెడ్డిపేట మండలం కామారెడ్డి జిల్లా 

రిసీవర్స్ 

5. మైసని అనిల్ తండ్రి బాగులు వయసు 31 సంవత్సరాలు ముధిరాజ్  వృత్తి స్క్రాప్ బిజినెస్ నివాసం రిసాల బజార్ బొల్లారం 

6. మహమ్మద్ ఆఫ్రోజ్ పాషా  తండ్రి గాల్ గౌస్ వయసు 29 సంవత్సరాలు ముస్లిం  వృత్తి స్క్రాప్ బిజినెస్ నివాసం  బొలక్ పూర్ ముషీరాబాద్

7. పగిడిపల్లి అశోక్ తండ్రి కిషన్ వయసు 32 సంవత్సరాలు ఎస్సీ మాల  వృత్తి డ్రైవర్  నివాసం వికాస్ నగర్ కామారెడ్డి ప్రస్తుతం కె ఎల్ ఆర్ వెంచర్ మేడ్చల్  

పరారీలో ఉన్న వారు  

8. మైసని బాగులు నివాసం మేడ్చల్ 

9. మైసని శేఖర్  తండ్రి బాగులు నివాసం మేడ్చల్ 

10. మహమ్మద్ అబ్బు నివాసం హైదారాబాద్ 

11. చాంద్ నివాసం హైదారాబాద్ 

నేరస్థులు మొత్తం చేసిన నేరాలు = 26

మొత్తం పోలీస్ స్టేషన్ పరిమితులు: 24

నమోదైన మొత్తం కేసులు : 10

నమోదు చేసుకోవాలి: 14

నిందితుల సంఖ్య: 04

దొంగిలించబడిన ఆస్తి రిసీవర్ల సంఖ్య: 7

కోల్పోయిన ఆస్తి మొత్తం : +25,00,000/-

రికవరీ చేయబడిన మొత్తం ఆస్తి: @ 6,75,000/-

హ్యుందాయ్ గ్రాండ్ I10 

ఇన్నోవా కారు 

బేలెనో కార్ 

హోండా షైన్ బైక్  

7 మొబైల్ ఫోన్స్ 

5 ఎయిర్ టెల్ (Base Band Unit)

కేసు ఛేదించిన సిబ్బంది వివరాలు: 

లక్ష్మి బాబు సి ఐ రామాయంపేట, .హరీష్ ఎస్‌ఐ చేగుంట మరియు క్రైమ్ డిటెక్టివ్ అధికారులు, ఎఎస్‌ఐ- రాంబాబు, హెడ్ కానిస్టేబుల్లు .శ్రీనివాస్, .సత్తయ్య కానిస్టేబుళ్లు .భాస్కర్,  జె.మహేష్ .బి. రాజు .విట్టల్ వెంకటేష్


ఈ కేసును ఛేదించిన సిబ్బందిని ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి ఎస్పీ డా.బి.బాలస్వామి  అభినందించి సిబ్బందికి రివార్డులు ఇవ్వడం జరిగింది.

Image 1

విత్తనాల ఎంపిక మరియు విత్తనాలు కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు : వ్యవసాయ అధికారి నర్సింహులపేట

Posted On 2024-05-16 22:34:57

Readmore >
Image 1

వేసవి లోతు దుక్కుల వలన కలిగే ప్రయోజనాలు

Posted On 2024-05-16 22:30:45

Readmore >
Image 1

డెంగ్యూ వ్యాధి ప్రజారోగ్యానికి పెను సమస్య: జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి.కళావతి బాయి

Posted On 2024-05-16 21:46:48

Readmore >
Image 1

పిడుగుపాటుకు గురై ఒకరు మృతి

Posted On 2024-05-16 19:48:35

Readmore >
Image 1

ఏసీబీ వలలో వ్యవసాయ అధికారి

Posted On 2024-05-16 19:23:17

Readmore >
Image 1

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

Posted On 2024-05-16 17:38:06

Readmore >
Image 1

ఇచ్చిన హామీల్లో మరోదానికి ఎగనామం? సన్న వడ్లకే బోనస్ అంటున్న రేవంత్ రెడ్డి

Posted On 2024-05-16 14:12:24

Readmore >
Image 1

అలిపిరి వద్ద కారు దగ్ధం

Posted On 2024-05-16 13:34:02

Readmore >
Image 1

భర్త కురుకురే ప్యాకెట్లు తేలేదని విడాకులకు అప్లై చేసిన భార్య

Posted On 2024-05-16 09:54:06

Readmore >
Image 1

నేడు తెలంగాణ నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు

Posted On 2024-05-16 09:07:38

Readmore >