| Daily భారత్
Logo


కాలం దాచిన యోధుడి కథ : స్పెషల్ స్టోరీ

Misc

Posted on 2024-01-10 21:58:25

Share: Share


 కాలం దాచిన యోధుడి కథ :  స్పెషల్ స్టోరీ

పోతుగల్ గ్రామం వెనుక చారిత్ర పై పరిశోధనాత్మక కథనం.

రాష్ట్రకుటుల నుంచి కాకతీయుల దాకా చారిత్రక ఆనవాళ్లు. 

డైలీ భారత్, పోతుగల్: తెలంగాణ ప్రాంతంలో ఎన్నో వీరోచిత గాధలకు ప్రాణం పోసింది కాకతీయుల కాలం. ఆ కాలమంతా సంస్కృతికంగా సామాజికంగా ఆనాటి సమాజంలో ఎన్నో మార్పులకు అనువుగా ఉన్నట్లు చరిత్ర మనకు చెబుతుంది. చరిత్ర కోసం అట్లా వెదుకులాడుతున్న క్రమంలోనే వినిపించిన పేరు "పోతిగంటి మైలి". ఆ పేరు చుట్టూ అల్లుకొని ఎంతో సాహసోపేతమైన యుద్ధ వీరుడు కథ కాలం నిక్షిప్తం చేసి మన ముందు ఉంచింది. కాకతి ప్రతాప రుద్ర దేవుని సేనానుల్లో ఒక్కడైనా పోతుగంటిమైలి ఇప్పటి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ ప్రాంతానికి చెందినవాడు కావడం వల్ల ఆయన ప్రాబల్యంలోనే ఈ ప్రాంతం ఉండడంవల్లే పోతుగంటిగా ప్రాచుర్యంలోకి వచ్చినట్లు కాలక్రమంలో పోతుగంటి పేరు నుంచి పోతుగల్ గా రూపాంతర చెందినట్లు తెలుస్తోంది.

ఎవరి పోతుగంటి మైలి..

అసమానమైన ధైర్యసాహసాలు పోతుగంటి మైలి సొంతం. ఖడ్గ విద్యలో అపారమైన నైపుణ్యం. ఆయన సాహసోపేతమైన జీవితం కాకతి ప్రతాప రుద్రదేవుని సెనానుల్లో ఒకడిగా అవకాశం కల్పించింది. ఈ ప్రాంతం నుంచి యోధుడిగా నిలబడిన పోతుగంటి మైలి ఆ కాలంలో ప్రత్యేకంగా నిలిచారని చెప్పవచ్చు.

గ్రామం కుర్పులోనే విభిన్నత్వం.

పోతుగల్ ప్రాంతంలో ప్రవహించే ఎల్లమ్మ వాగు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ముస్తాబాద్ పెద్ద చెరువు నుంచి మొదలైన ఎల్లమ్మ వాగు ప్రవాహం చుట్టు ఉన్న ఎనిమిది గ్రామాల సమూహమే ఆనాడు పూర్తిగా పోతిగంటి మైలి ఆధీనంలో ఉండివి. ఇప్పటికి చెదిరిపోయిన ఆ గ్రామాల ఉన్నవాళ్లు అనేక రూపాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. నగరం, అంగడి బజార్, నందుల గడ్డ, పాదాల చింత, పుట్టల గడ్డ, పసుపు తోట, పాటిమీద,  ఇలా ఒకదానికొకటి అనుకుని ఉన్న గ్రామాల సమూహమే పోతుగంటి. ఇక్కడ ఎల్లమ్మ వాగు నుంచి వ్యవసాయానికి నీటిని మళ్లించే ప్రాచీన విధానాలు ఇప్పటికి మనుగడలో ఉన్నాయి. నీటి ప్రవాహం చుట్టు గ్రామాల నిర్మాణం వెనుక పోతుగంటి మైలి అనుసరించిన విధానం ఇప్పటికీ ఇక్కడి రైతులు అనుసరిస్తున్నారు.

క్రీస్తు శకం 1303లో ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ కిల్జీ దండయాత్రను ఎదుర్కొని ఉప్పరపల్లి గోడిసాల వద్ద తురుస్కు సేనాలను తరిమికొట్టిన యోధుడిగా పోతుగంటి మైలి సాహసాలను చరిత్ర పది చేసింది.చరిత్ర లో ఒక సమయంలో కప్పం చెల్లించేందుకు ఢిల్లీ వెళ్లిన సందర్భంలో అల్లావుద్దీన్ ఖిల్జీ ఆస్థానంలో  పోతుగంటి మైలి ఖడ్గ నైపుణ్యాన్ని చూసి ఢిల్లీ సుల్తాను ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది. తన అసమానమైన ఖడ్గ విద్య నైపుణ్యంతో ప్రత్యేకంగా నిలిచేవాడు. పోతుగంటి మళ్లీ ప్రస్తావన కరీంనగర్ జిల్లా చరిత్ర సంస్కృతి గ్రంధంలో డాక్టర్ జై శెట్టి రమణయ్య ప్రస్తావించారు. చారిత్రకంగా నిర్ధారించే శాసనాలు కానీ ఆధారాలు కానీ పూర్తిగా లభ్యం కానీ పరిస్థితి ఉంది. ఈ ప్రాంతంలో కొన్ని శిలా శాసనాలు కనిపించాయి. చరిత్రకారులు పూర్తిస్థాయిలో పరిశోధన జరిపి నిర్ధారణ చేయవలసి ఉంది.

కాలక్రమంలో  మరొ కదనం ప్రాచుర్యంలోకి వచ్చింది.

ఇప్పటి పోతుగల్ నిర్మాణం వెనుక ఆసక్తికరమైన కథనం ప్రాచుర్యంలో ఉంది. ఈ ప్రాంతమంతా ప్లేగు వ్యాధి విస్తరించి ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే ఆనాటి గ్రామ పెద్దలు పోతు మెడలో గంట కట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్య రూపం లో అనేక పదార్థాలను ఆ పోతుకు సమర్పించి వదిలేవారు. ఆ పోతు ఎక్కడ ఆగితే అక్కడే గ్రామ నిర్మాణం చేపట్టాలని సమిష్టిగా ఆనాటి ప్రజలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పోతు మెడలో గంట కట్టి వదలం వల్ల ఇప్పటి పోతుగల్ బస్టాండ్ సమీపంలో సేద తీరడంతో అక్కడే పోతుగల్ గ్రామాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఎనిమిది గ్రామాల ప్రజలు ఈ ప్రాంతాలను ఖాళీ చేసి వెళ్లి పోతుగల్  చేరుకోవడంతో గ్రామాలన్నీ కనుమరుగైపోయాయి. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో ఆనాటి గ్రామాల తాలూకు ఆనవాళ్లు అప్పట్లో ఆరాధించిన గ్రామ దేవతల తాలూకు ప్రతిమలు కనిపిస్తాయి. మనకు వినిపిస్తున్న పోతు మెడలో గంట కట్టడం వల్ల పోతుగల్ అనే పేరు వచ్చిందని మాత్రమే ఇప్పటి తరానికి తెలుసు.

నిజానికి పోతుగంటి మైలీ ఈ ప్రాంతంలో తన అసమానమైన యుద్ధ నైపుణ్యంతో కాకతీయ సేనానులు ఒకడిగా గుర్తింపు పొందిన విషయం చరిత్ర లో ఎప్పటికి చెరిగిపోని అంశమే.  కనుమరుగైపోయిన కొన్ని గ్రామాల తావుల్లో పోతుగల్ గ్రామ చరిత్ర వెనుక నిక్షిప్తమైన పోతుగంటి మైలీ సాహసోపేతమైన జీవనం పదిలం చేసిన పోతుగల్ ఊరు చెబుతున్న చరిత్ర .

రాష్ట్ర కుటుల ఎలుబడిలో ఈ ప్రాంతం ఉండేదా..

భారత దేశంలో అత్యధిక భూభాగంలో  ఆరవ శతాబ్దం నుండి పదో శతాబ్దం  వరకు రాష్ట్ర కుటుల  ఏలుబడిలో ఉన్నట్లు తెలుస్తుంది. తెలంగాణ ప్రాంతంలోని రాష్ట్రకుతుల ఏలుబడి కొనసాగిందని అనేక చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ కనిపించిన శిల్పాలలో అనేకం రాష్ట్ర కాలానికి సంబంధించినవై ఉన్నాయి. తలపాగా ధరించే విధానం  ఆ కాలంలో ఉండేదని తెలుస్తోంది. తలపాగా ధరించిన శిల్పాలు ఈ ప్రాంతంలో కనిపించ్చాయి. రాష్ట్రకుటుల సంస్కృతిని ప్రతిబింబించే శిల్పాలు విరివిరిగా కనిపించాయి. గ్రామ దేవతలు విగ్రహాల తో పాటు మరికొన్ని అరుదైన  విగ్రహాలు కనిపించాయి వేల ఏండ్ల చరిత్ర పదిలం చేసిన ఈ ప్రాంతనికి సంబంధించి పూర్తి చరిత్ర వెలుగులోకి రావాల్సి ఉంది.

                                                                                                                                                              

                                                                                                                                                                - అల్లే.రమేష్ జర్నలిస్ట్. సిరిసిల్ల.


Image 1

ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2024-05-15 19:01:12

Readmore >
Image 1

కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష : వడ్ల కోనుగోలు పై సీరియస్

Posted On 2024-05-15 13:52:23

Readmore >
Image 1

ఉపాధ్యాయులపై లాఠీచార్జి అమానుషం : TTU రాజన్న సిరిసిల్ల జిల్లా

Posted On 2024-05-15 13:42:59

Readmore >
Image 1

తెలంగాణలో 10 రోజులు థియేటర్లు బంద్

Posted On 2024-05-15 11:32:10

Readmore >
Image 1

కర్నూలు జిల్లాలో బంగారు నిక్షేపాలు

Posted On 2024-05-15 10:33:33

Readmore >
Image 1

ఎల్లమ్మ తల్లి పండుగలో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్

Posted On 2024-05-14 22:33:34

Readmore >
Image 1

తీహార్ జైలుకు బాంబు బెదిరింపు

Posted On 2024-05-14 20:59:56

Readmore >
Image 1

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను సందర్శించిన డాక్టర్ బి. కళావతి భాయి

Posted On 2024-05-14 20:54:19

Readmore >
Image 1

తొలి 6G డివైజ్ను ఆవిష్కరించిన జపాన్

Posted On 2024-05-14 18:54:45

Readmore >
Image 1

ఉపాధ్యాయులపై లాఠీచార్జ్ చేయించిన ఆర్డీఒ పై చర్యతీసుకోవాలి

Posted On 2024-05-14 13:43:30

Readmore >