| Daily భారత్
Logo


రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి శిల్ప తయారీ కేంద్రం ఆనవాళ్లు

Misc

Posted on 2023-12-07 19:07:20

Share: Share


రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి శిల్ప తయారీ కేంద్రం ఆనవాళ్లు

చరిత్రను పదిలం చేసిన "నందులగుట్ట."

రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి శిల్ప తయారీ కేంద్రం. 

11వ శతాబ్దం కాకతీయుల కాలానికి చెందిన శిల్ప తయారి కేంద్రం ఆనవాళ్లు.


డైలీ భారత్, సిరిసిల్ల : చరిత్రలో మానవ నాగరికత వికాసంలో భాగమైన అనేక చారిత్రక అంశాలు కాలగర్భంలో కలిసిపోయిన తిరిగి అప్పుడప్పుడు పలకరిస్తూనే ఉంటాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం వెంకయ్య కుంట గ్రామ పరిధిలో జిల్లాలోని అరుదైన తొలి శిల్పాల తయారీ కేంద్రం వెలుగు చూసింది. ప్రాచీన చరిత్ర తాలూకు ఆనవాళ్లు ముస్తాబాద్ మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వెంకయ్య కుంట గ్రామ శివారులోని నందులగుట్ట అటవీ ప్రాంతంలో ఉన్నాయని జర్నలిస్టు మిత్రుడు ఇచ్చిన సమాచారం. నందలగుట్ట అని చెప్పడంతో ఆ ప్రాంతానికి ప్రత్యేకత ఉంటుందని భావించి మా ప్రయాణం మొదలైంది.

సిరిసిల్ల జిల్లా కేంద్రం నుండి మొదలైన ప్రయాణం ముస్తాబాద్ కు చేరుకోగానే అక్కడ జర్నలిస్టు మిత్రుడు సహకారంతో వెంకయ్య కుంట పరిధిలో నందులగుట్ట ప్రాంతానికి బయలుదేరాము. వెంకయ్య కుంట నుండి కొంత దూరం ద్విచక్ర వాహనాలపై వెళ్లిన తర్వాత దారి లేకపోవడంతో కాలి నడకన ప్రయాణం సాగించాము. కొంత దూరం నడక ప్రయాణం తర్వాత మాతో వచ్చిన జర్నలిస్టు మిత్రుడు ఇదే నందుల గుట్ట అంటూ చూపించాడు. చుట్టూ పొలాలు పత్తి చెన్ల మధ్య మట్టిదిబ్బల కనిపించిన ప్రాంతం. ఆ ప్రదేశం వైపు నడకను కొనసాగించాము. నందులగుట్ట దగ్గరకు అడుగుపెడుతూనే చుట్టూ పరచుకున్న నల్లటి రాళ్లు కనిపించాయి. కుప్పలు కుప్పలుగా వివిధ ఆకారలలో ఉన్న నల్లటి రాళ్లు ఎక్కడ చూసినా దర్శనమిచ్చాయి. వివిధ సైజుల్లో రాతి గుండ్లను తొలిచిన ఆనవాళ్లు అనేకం కనిపించాయి. ఈ ప్రదేశంలో అనేక శిల్పాలను చెక్కినట్లు తొలిచిన రాతి గుండ్లు ఆనాటి చరిత్ర పట్టి చూపుతున్నాయి.  రాతి శిలా తోరణాలతో పాటు ఆలయాల్లో కనిపించే అనేక రకాల రూపాలకు శిల్పులు ఇక్కడ తమ ఉలితో ప్రాణం పోసినట్లు తెలుస్తుంది. కాకతీయుల కాలంలో సాంస్కృతికంగా తెలంగాణ భూభాగంలో అనేక ప్రాంతాల్లో విరివిరిగా వెలిసిన ఆలయాల కనిపిస్తాయి. కాకతీయుల కాలంలో శివ లింగాలతో పాటు ఆలయాల్లో వివిధ రూపాల్లో నందులు మనకు కనిపిస్తాయి. గుట్టపై అరుదుగా కనిపించి నల్లటి గ్రానైట్ రాయి శిల్పాలు చేక్కడానికి అనువుగా ఉండడంతో ఈ ప్రాంతంలోనే శిల్పులు అనేక రూపాలలో శిల్పాలను చెప్పినట్లు తెలుస్తోంది. అనేక ప్రాంతాల ఆలయాలకు ఇక్కడి శిల్పాలు వన్నె తెచ్చాయి. ఈ ప్రాంతంలో కాలాలు గుణంగా వచ్చిన మార్పుల్లో శిల్పకళ నైపుణ్యానికి ప్రాణం పోసిన ప్రాంతం మట్టిదిబ్బగా మిగిలిపోయింది. గతంలో ఈ ప్రాంతంలో అనేక నంది శిల్పాలు కనిపించడంతోని తమ నందిగుట్టని పిలుస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రస్తుతానికి చెక్కిన శిల్పాలు ఎక్కడ కనిపించకపోయినా శిల్పాలను తొలిచిన రాళ్లు మాత్రం సజీవంగానే ఉన్నాయి.

శిల్పాలకు అనువైన నల్లటి గ్రానైట్ రాయి జిల్లాలో ఈ ఒక్క చోటే కనిపిస్తుండడం చూడవచ్చు. ఎన్నో ఆలయాలకు వన్నెతెచ్చిన శిల్పాకారులు కనుమరుగైపోయిన ఆనాటి చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లను మిగిల్చిపోయారు. సుమారు క్రీస్తు శకం 11వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని శిల్పాలు చెక్కడానికి అనువుగా ఆనాటి శిల్పకారులు ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ నందులగుట్టపై శిల్పాన్ని చెక్కిముందు శిల్పాకారులు వేసుకున్న స్కెచ్ తాలూకు ఆనవాళ్లు పదిలంగా ఉన్నాయి. కాకతీయుల శిల్పకలకు సంబంధించిన ఆనవాళ్లను పట్టిచూపుతున్న గుర్తులవి. నందిగుట్టపై ఎక్కడ చూసినా శిల్పాలు చెక్కగా మిగిలిపోయిన రాళ్లు పద్ధతి ప్రకారం పేర్చినట్లు కనిపిస్తాయి. అలా ఎందుకు పేర్చి ఉంటారనేది మాత్రం మిస్టరీ గాని ఉంది. ఒక ఫిట్ శిల్పాలు మొదలుకొని వివిధ ఆకృతుల్లో ఐదు ఫీట్లపైగా శిల్పాలను చెక్కినట్లు ఇక్కడ మిగిలిపోయిన రాతి పలకలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ దక్కన్ పీఠభూమిలో అరుదైన ప్రదేశంగా నందుల గుట్టను చూడవచ్చు. శిల్పాలకు జీవం పోసి నల్లటి గ్రానైట్ రాయి. రాయిని గుండెల్లో దాచుకున్న నందులగుట్ట నుంచి 11 వ శతాబ్దంలో నిర్మించిన అనేక ఆలయాలకు అరుదైన నల్ల రాతి శిల్పాలను అందించిన ప్రాంతమని చెప్పవచ్చు. బహుశా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తొలి రాతి శిల్పాల తయారీ కేంద్రం ఇదే అయి ఉండవచ్చు. చరిత్రకారులు పూర్తిస్థాయిలో ఈ ప్రాంతాన్ని పరిశీలించి మరిన్ని విషయాలు వెలుగులోకి తేవాల్సి ఉంది. ఇది నందుల గుట్ట మనకు చెబుతున్న చరిత్ర.  మరో చారిత్రక కథనంలో మళ్లీ కలుసుకుందాం..


                                                                                                                                                                       అల్లే రమేష్, జర్నలిస్ట్, సిరిసిల్ల

Image 1

ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2024-05-15 19:01:12

Readmore >
Image 1

కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష : వడ్ల కోనుగోలు పై సీరియస్

Posted On 2024-05-15 13:52:23

Readmore >
Image 1

ఉపాధ్యాయులపై లాఠీచార్జి అమానుషం : TTU రాజన్న సిరిసిల్ల జిల్లా

Posted On 2024-05-15 13:42:59

Readmore >
Image 1

తెలంగాణలో 10 రోజులు థియేటర్లు బంద్

Posted On 2024-05-15 11:32:10

Readmore >
Image 1

కర్నూలు జిల్లాలో బంగారు నిక్షేపాలు

Posted On 2024-05-15 10:33:33

Readmore >
Image 1

ఎల్లమ్మ తల్లి పండుగలో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్

Posted On 2024-05-14 22:33:34

Readmore >
Image 1

తీహార్ జైలుకు బాంబు బెదిరింపు

Posted On 2024-05-14 20:59:56

Readmore >
Image 1

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను సందర్శించిన డాక్టర్ బి. కళావతి భాయి

Posted On 2024-05-14 20:54:19

Readmore >
Image 1

తొలి 6G డివైజ్ను ఆవిష్కరించిన జపాన్

Posted On 2024-05-14 18:54:45

Readmore >
Image 1

ఉపాధ్యాయులపై లాఠీచార్జ్ చేయించిన ఆర్డీఒ పై చర్యతీసుకోవాలి

Posted On 2024-05-14 13:43:30

Readmore >