| Daily భారత్
Logo


తెలంగాణకు రెండో సీఎం గా రేవంత్ రెడ్డి

News

Posted on 2023-12-05 19:13:58

Share: Share


తెలంగాణకు రెండో సీఎం గా రేవంత్ రెడ్డి

డైలీ భారత్ హైదరాబాద్: తెలంగాణ సీఎం ఎవరన్నది తేలిపోయింది.నరాలు తెగే ఉత్కంఠకు కాంగ్రెస్ తెరదీసింది. ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డినే ఫైనల్ చేస్తూ అధికారికంగా ప్రకటించిన కేసి వేణుగోపాల్.తెలంగాణకు రేవంత్ రెడ్డి రెండో ముఖ్యమంత్రిగా నియామకం అయ్యారు.

ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజార్టీ లభించింది. ప్రభుత్వ ఏర్పాటుకు 60 సీట్లు కావాల్సి ఉండగా.. కాంగ్రెస్‌కు ప్రజలు 64 సీట్లు కట్టబెట్టారు. బీఆర్ఎస్‌కు 39 సీట్లు, బీజేపీకి 8, ఎమ్ఐఎమ్‌కు 7, సీపీఐకి 1 స్థానాల్లో అవకాశం ఇచ్చారు.

అయితే, ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పోటీ ఉండటంతో అధిష్టానం అందరితో రెండ్రోజుల పాటు సుధీర్ఘ మంతనాలు జరిపి రేవంత్ రెడ్డిని ఫైనల్ చేసింది.

అంతేకాదు.. తెలంగాణ డిప్యూటీ సీఎంలుగా భట్టి విక్రమార్క, సీతక్కను ఎంపిక చేశారు. మరోవైపు రేవంత్ రెడ్డి సీఎంగా.. డిసెంబర్ 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

7వ తేదీన గురువారం మంచి ముహూర్తం ఉండటంతో పార్టీ ఆ రోజునే ఫైనల్ చేసింది. మరోవైపు రేవంత్ రెడ్డితో పాటు ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేస్తారనేది ఆసక్తిగా మారింది...

Image 1

విత్తనాల ఎంపిక మరియు విత్తనాలు కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు : వ్యవసాయ అధికారి నర్సింహులపేట

Posted On 2024-05-16 22:34:57

Readmore >
Image 1

వేసవి లోతు దుక్కుల వలన కలిగే ప్రయోజనాలు

Posted On 2024-05-16 22:30:45

Readmore >
Image 1

డెంగ్యూ వ్యాధి ప్రజారోగ్యానికి పెను సమస్య: జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి.కళావతి బాయి

Posted On 2024-05-16 21:46:48

Readmore >
Image 1

పిడుగుపాటుకు గురై ఒకరు మృతి

Posted On 2024-05-16 19:48:35

Readmore >
Image 1

ఏసీబీ వలలో వ్యవసాయ అధికారి

Posted On 2024-05-16 19:23:17

Readmore >
Image 1

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

Posted On 2024-05-16 17:38:06

Readmore >
Image 1

ఇచ్చిన హామీల్లో మరోదానికి ఎగనామం? సన్న వడ్లకే బోనస్ అంటున్న రేవంత్ రెడ్డి

Posted On 2024-05-16 14:12:24

Readmore >
Image 1

అలిపిరి వద్ద కారు దగ్ధం

Posted On 2024-05-16 13:34:02

Readmore >
Image 1

భర్త కురుకురే ప్యాకెట్లు తేలేదని విడాకులకు అప్లై చేసిన భార్య

Posted On 2024-05-16 09:54:06

Readmore >
Image 1

నేడు తెలంగాణ నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు

Posted On 2024-05-16 09:07:38

Readmore >