| Daily భారత్
Logo


నోటుకి ఓటు అమ్ముకుంటే ఐదేళ్ల భవిష్యత్తు అధోగతే

News

Posted on 2023-11-24 13:21:58

Share: Share


నోటుకి ఓటు అమ్ముకుంటే ఐదేళ్ల భవిష్యత్తు అధోగతే

జైభారత్ జస్ట్ ఓట్ క్యాంపెయిన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖదిజ్ఞాసి సత్యనారాయణ గోల

డబ్బుకి ఓటు అమ్ముకుంటే బ్రతికున్నా.. శవంతో సమానం పోస్టర్ల ఆవిష్కరణ

డైలీ భారత్ రాజన్న సిరిసిల్ల : ఎన్నికల్లో రాజకీయనాయకులు చూపే డబ్బు ఎరకు ఆశపడితే - మరో ఐదేళ్ల పాటు మోసపోవడం ఖాయమని జైభారత్ జస్ట్ ఓట్ క్యాంపెయిన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖదిజ్ఞాసి సత్యనారాయణ గోల అన్నారు. శుక్రవారము సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ధనస్వామ్యాన్ని బద్దలు కొట్టండి - ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి ఓటు అమ్ముకుంటే బ్రతికున్నా శవంతో సమానం పోస్టర్లను జైభారత్ జాతీయ కార్యదర్శి ఖదిజ్ఞాసి లోక్ నాథ్, జైభారత్ జస్ట్ ఓట్ క్యాంపెయిన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖదిజ్ఞాసి సత్యనారాయణ గోల, కార్యదర్శి ఖదిజ్ఞాసి సుధాకర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జైభారత్ జస్ట్ ఓట్ క్యాంపెయిన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖదిజ్ఞాసి సత్యనారాయణ గోల మాట్లాడుతూ ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని ప్రశ్నిస్తూ, నిలువరిస్తూ జైభారత్ గత పదిహేనేళ్లుగా జైభారత్ జస్ట్ ఓట్ క్యాంపెయిన్ ద్వారా విస్తృతమైన ప్రచారోద్యమాన్ని నిర్వహిస్తోందని అన్నారు. జైభారత్ జాతీయ కార్యదర్శి ఖదిజ్ఞాసి లోక్ నాథ్ మాట్లాడుతూ నోటుకి ఐదేళ్ల భవిష్యత్తుని అమ్మిన మనిషి శవంతో సమానం - నాయకులు పోస్తున్న మద్యానికీ, పడేస్తున్న నోటుకీ ఓటుని అమ్ముకుంటున్నందుకు సిగ్గులేదా అని ఓటర్లని పదునుగా ప్రశ్నిస్తూ లక్షలాది పోస్టర్లద్వారా, ఎన్నికలు జరుగుతున్న ప్రతిచోటా ఓటర్లను జైభారత్ జాగృతం చేస్తుందని అన్నారు. జైభారత్ జస్ట్ ఓట్ క్యాంపెయిన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి ఖదిజ్ఞాసి సుధాకర్ మాట్లాడుతూ..  ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉందని అన్నారు. అనంతరం పట్టణంలో పలు చోట్ల ఫాంప్లెట్స్ ను పంచి, పోస్టర్లను అతికించారు.

Image 1

భర్త కురుకురే ప్యాకెట్లు తేలేదని విడాకులకు అప్లై చేసిన భార్య

Posted On 2024-05-16 09:54:06

Readmore >
Image 1

నేడు తెలంగాణ నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు

Posted On 2024-05-16 09:07:38

Readmore >
Image 1

ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2024-05-15 19:01:12

Readmore >
Image 1

కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష : వడ్ల కోనుగోలు పై సీరియస్

Posted On 2024-05-15 13:52:23

Readmore >
Image 1

ఉపాధ్యాయులపై లాఠీచార్జి అమానుషం : TTU రాజన్న సిరిసిల్ల జిల్లా

Posted On 2024-05-15 13:42:59

Readmore >
Image 1

తెలంగాణలో 10 రోజులు థియేటర్లు బంద్

Posted On 2024-05-15 11:32:10

Readmore >
Image 1

కర్నూలు జిల్లాలో బంగారు నిక్షేపాలు

Posted On 2024-05-15 10:33:33

Readmore >
Image 1

ఎల్లమ్మ తల్లి పండుగలో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్

Posted On 2024-05-14 22:33:34

Readmore >
Image 1

తీహార్ జైలుకు బాంబు బెదిరింపు

Posted On 2024-05-14 20:59:56

Readmore >
Image 1

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను సందర్శించిన డాక్టర్ బి. కళావతి భాయి

Posted On 2024-05-14 20:54:19

Readmore >