| Daily భారత్
Logo


ముంపుగ్రామాలపై బిఆర్ఎస్ కు చిత్తశుద్ధి లేదు : కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆది శ్రీనివాస్

News

Posted on 2023-11-18 21:25:41

Share: Share


ముంపుగ్రామాలపై బిఆర్ఎస్ కు చిత్తశుద్ధి లేదు : కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆది శ్రీనివాస్

అధికారంలోకి రాగానే ముంపుగ్రామాల సమస్యల పరిస్కారం

ఇండస్ట్రీ కారిడార్ ఏర్పాటు

డైలీ భరత్, వేములవాడ: ముంపు గ్రామాల సమస్యలపై అధికార బిఆర్ఎస్ కు చిత్తశుద్ధి లేదని వేములవాడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆది శ్రీనివాస్ అన్నారు.. శనివారం రోజున వేములవాడ అర్బన్ మండలంలోని చింతల్ ఠాణ,గుర్రవాని పల్లె,చర్లవంచ,చంద్రగిరి తెట్టకుంట గ్రామంల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ కు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు.. ఈ సందర్భంగా స్థానిక నాయకులు మాట్లాడుతూ ముంపుగ్రామాల సమస్యలు పై మన పోరాటంలో మనకు అండగా ఉన్న చేసిన వ్యక్తి ఆది శ్రీనివాస్ అన్నారు..ముంపు సమస్యలపై పూర్తి అవగాహన ఉన్నా వ్యక్తి ఆది శ్రీనివాస్ కు మనం అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.. అధికార బిఆర్ఎస్ ప్రభుత్వం 5 లక్షల నష్టపరిహారం ఇస్తామని చెప్పి మోసం చేసింది అని. ముంపు గ్రామాల ప్రజలు అందరు తమ ఓటు ద్వారా బిఆర్ఎస్ ప్రభుత్వనికి బుద్ధిచెప్పాలని తెలిపారు....ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ముంపు గ్రామాల ప్రజలకు పట్టాలు అందలేదని ఈ విషయంలో అధికార పార్టీ నాయకులను అడుగుతే మీకు ఇచ్చే దానికంటే ఎక్కువగా ఇచ్చాం అనడం చాలా హాస్యహాస్పదం అన్నారు..ముంపు గ్రామాల్లో ప్రతి రోజు ఉదయం 10 దాటితే పని కోసం 20 నుండి 30 కిలోమీటర్ల దూరం పనికొసం వెళ్లే మా అక్కలను అమ్మలను చూస్తే గుండె తరుక్కుపోతుందన్నారు... ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ముంపుగ్రామాల ప్రజలు కోసం ఆనాడు అధికార పార్టీ వారు రాజన్న తంతేల మీద 5 లక్షల,డబుల్ బెడ్రోమ్ లు ఇస్తామని ఇచ్చిన హామీ ఏమయ్యిందన్నారు.. దొంగ హామీలు ఇచ్చి పాలాభిషేకలు,పాటకులు కొట్టించుకొని ప్రజలను బురిడీ కొట్టించారని అన్నారు.మనం ధర్నాలు రాస్తారోకోలు చేస్తే కలెక్టర్ దగ్గరికి బిఆర్ఎస్ నాయకులను పిలిపించుకున్నారని కానీ ముంపు గ్రామాల ప్రజలను పిలవలేదన్నారు... పల్లె నిద్రలో భాగంగా రేవంత్ రెడ్డి ముంపుగ్రామాల సమస్యలు చూసి చలించిపోయారన్నారు.. ఇక్కడి ప్రజలకు ఫ్లాట్ లేదు పూర్తి స్థాయిలో ప్యాకేజీ కూడా పూర్తి కాలేదని అన్నారు.

అధికారంలోకి రాగనే ముంపు గ్రామాలకు పరిశ్రమలు,ఇండస్ట్రీ కారిడార్ ఏర్పాటు చేస్తామని,కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ లను అమలు చేస్తామన్నారు...మన భూములు గుంజుకొని మన పైనే అజామాసి చేలాయిస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వంనికి బుద్ది చెప్పాలని అన్నారు.తమ అమూల్యమైన ఓటును చేతి గుర్తు పై వేసి గెలిపించాలని కోరారు...

Image 1

విత్తనాల ఎంపిక మరియు విత్తనాలు కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు : వ్యవసాయ అధికారి నర్సింహులపేట

Posted On 2024-05-16 22:34:57

Readmore >
Image 1

వేసవి లోతు దుక్కుల వలన కలిగే ప్రయోజనాలు

Posted On 2024-05-16 22:30:45

Readmore >
Image 1

డెంగ్యూ వ్యాధి ప్రజారోగ్యానికి పెను సమస్య: జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి.కళావతి బాయి

Posted On 2024-05-16 21:46:48

Readmore >
Image 1

పిడుగుపాటుకు గురై ఒకరు మృతి

Posted On 2024-05-16 19:48:35

Readmore >
Image 1

ఏసీబీ వలలో వ్యవసాయ అధికారి

Posted On 2024-05-16 19:23:17

Readmore >
Image 1

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

Posted On 2024-05-16 17:38:06

Readmore >
Image 1

ఇచ్చిన హామీల్లో మరోదానికి ఎగనామం? సన్న వడ్లకే బోనస్ అంటున్న రేవంత్ రెడ్డి

Posted On 2024-05-16 14:12:24

Readmore >
Image 1

అలిపిరి వద్ద కారు దగ్ధం

Posted On 2024-05-16 13:34:02

Readmore >
Image 1

భర్త కురుకురే ప్యాకెట్లు తేలేదని విడాకులకు అప్లై చేసిన భార్య

Posted On 2024-05-16 09:54:06

Readmore >
Image 1

నేడు తెలంగాణ నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు

Posted On 2024-05-16 09:07:38

Readmore >