| Daily భారత్
Logo




1523 ప్రత్యేక అవసరాల టీచర్‌ పోస్టులు: శాశ్వత ప్రతిపాదికన నియామకం

News

Posted on 2023-08-27 11:06:45

Share: Share


1523 ప్రత్యేక అవసరాల  టీచర్‌ పోస్టులు: శాశ్వత ప్రతిపాదికన నియామకం

కొత్తగా క్రియేట్‌ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

10 మంది విద్యార్థులకు ఒక టీచర్‌

ఆర్థిక శాఖ ఆమోదం.. జీవో జారీ

డీఎస్సీకి మార్గం సుగమం

హైదరాబాద్‌ :ఆగస్టు 27

తెలంగాణ సర్కారు మరో మానవీయ నిర్ణయం తీసుకొన్నది. బుద్ధిమాంద్యత, ఆటిజం, మాస్క్యూలర్‌ డిస్ట్రోఫీవంటి పలు రకాలైన వైకల్యాలతో బాధపడుతున్న విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ప్రత్యేకంగా టీచర్లను నియమించాలని నిర్ణయించింది.

శాశ్వత ప్రాతిపదికన స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్లను నియమించేందుకు పచ్చజెండా ఊపింది. పది మంది విద్యార్థులకు ఒకరు చొప్పున మొత్తంగా 1,523 స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ ఫర్‌ డిజేబుల్డ్‌ టీచర్‌ పోస్టులను కొత్తగా మంజూరు చేయడమే కాకుండా ఆయా పోస్టుల నియామకానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

ఈ మేరకు శనివారం ఆర్థికశాఖ జీవో నెంబర్‌-125ను జారీచేసింది. వీటిలో ప్రాథమికోన్నత పాఠశాలల్లో 798, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 727 టీచర్‌ పోస్టులు ఉన్నాయి.

ప్రాథమిక పాఠశాలల్లో బోధించే సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పే స్కేల్‌ రూ. 31,040 -92,050, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో బోధించే స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్‌ పేస్కేల్‌ రూ.42,300 -1,15,270గా ఖరారు చేసింది.

విద్యాశాఖ సర్వే ప్రకారం రాష్ట్రంలో 30వేల వరకు ప్రత్యేకావసరాలు గల చిన్నారులు ఉన్నారు. వీరంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. వీరిలో 10,900 మంది ప్రాథమిక పాఠశాలల్లో, మరో 18,857 మంది ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు.

కొత్తగా మంజూరు చేసిన 1,523 మంది టీచర్ల ద్వారా ప్రత్యేక అవసరాలుగల పిల్లలకు వారి అవసరాల మేరకు విద్యాబోధన చేయనున్నారు

Image 1

వివాహేతర సంబంధం కోసం భర్తను సజీవ దహనం చేసిన భార్య

Posted On 2026-04-16 11:11:21

Readmore >
Image 1

డబ్బు కోసం క్లాస్‌మేట్‌ కిడ్నాప్‌..

Posted On 2026-04-14 19:28:05

Readmore >
Image 1

అంబేద్కర్ జయంతి వేడుకలలో పాల్గొన్న డిజిపి

Posted On 2026-04-14 19:15:28

Readmore >
Image 1

సిరిసిల్ల విద్యుత్ శాఖ ఎస్‌ఈగా టి. వేణుమాధవ్ బాధ్యతల స్వీకరణ

Posted On 2026-04-14 18:35:16

Readmore >
Image 1

విదేశీ ఉద్యోగాల పేరుతో భారీ మోసం

Posted On 2026-04-14 18:28:08

Readmore >
Image 1

సత్తా చాటిన సెస్ బాలికల జూనియర్ కళాశాల ,సిరిసిల్ల : జిల్లాలోనే ప్రథమ స్థానం

Posted On 2026-04-14 18:02:15

Readmore >
Image 1

జులూరుపాడు మండలం చండుగొండ క్రాస్ రోడ్ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో 135 వ జయంతి వేడుకలు

Posted On 2026-04-14 16:38:34

Readmore >
Image 1

జూలూరుపాడు మండలం లో భారతరత్న బిఆర్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలు

Posted On 2026-04-14 15:44:35

Readmore >
Image 1

కొల్లేరు పెద్దింట్లమ్మ...

Posted On 2026-04-14 15:03:37

Readmore >
Image 1

ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో మహిళా మావోయిస్టు రూపిరెడ్డి మృతి

Posted On 2026-04-14 14:51:33

Readmore >