| Daily భారత్
Logo


ఉగాది పండుగ ప్రాధాన్యత...

Devotional

Posted on 2024-04-08 17:44:53

Share: Share


ఉగాది పండుగ ప్రాధాన్యత...

ఉగాది పండుగ ప్రాధాన్యత   తెలుసుకుందామా ...!

డైలీ భారత్, ఉగాది స్పెషల్: ఉగాది ఈ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది మన తెలుగు పండుగ ఉగాది. ఉగాది నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది ఇది తెలుగువారి మొదటి పండుగ. ఈ రోజు కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలసుకొని గ్రహశాంతుల లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండటానికి పంచాగశ్రవణాన్ని చేస్తారు.

పెద్దలు మనకు అందించిన ఉగాది పండుగ  విశేషాలు ప్రాంతాల వారీగా  తెలుసుకుంధాం

వేదాలను హరించిన సోమకుని వధించి మత్స్యవతారిదారియైన విష్ణువు వేదాలను బ్రహ్మకప్పగించి న శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్ధం ఉగాది ఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి.చైత్రశుక్లపాడ్యమినాడు విశాలవిశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు,  కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపబడుతుందని కూడా చెప్పబడుతుంది, శాలివాహన చక్రవర్తి చైత్రశుక్లపాడ్యమినాడే పట్టాభిషిక్తుడై తన శౌర్యపరా క్రమాలతో శాలివాహన యుగకర్తగా భాసిల్లిన కారణాన ఆ యోధాగ్రని స్మృత్యర్థం ఉగాది ఆచరింపబడుతుందని చారిత్రక నిజం,  ఏది ఏమైనా జడ ప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగుల్కొల్పి మానవాళిలో నూతనాశయాలను అంకురింపచేసే శుభదినం మే ఉగాది. శిశిర ఋతువు ఆకులు రాలె  కాలం,  శిశిరం తరువాత వసంతం వస్తుంది,  చెట్లు చిగురించి, ప్రకృతి శోభాయమానంగా వుంటుంది,  కోయిలలు కుహూకుహూ అని పాడుతాయి, (2) ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కనుక  ఇది తెలుగువారి మొదటి పండుగ ఉగాది, ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట జరుగును, ఉగాది రోజున పొద్దున  లేచి ఇళ్లు, వాకిళ్లు, శుభ్ర పరచుకుంటారు,  ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు.

ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకమైంది షడ్రుచుల సమ్మేళనం తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం, సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది,  ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు.

ఉగాది పచ్చడి ప్రాముఖ్యత

ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి, షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక, జీవితం అన్ని అనుభవములు కలిగినదైతేనే అర్ధవంతం అని చెప్పే భావం ఇమిడి ఉంది, పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్ధం ఒక్కొక భావానికి, అనుభవానికి ప్రతీక.

 పచ్చడి లో వాడే పదార్థాల విశిష్టత

(1)బెల్లం,   తీపి  ఆనందానికి సంకేతం(2)ఉప్పు , జీవితంలో ఉత్సాహం , రుచికి సంకేతం(3)

వేప,  పువ్వు  చేదు బాధకలిగించే అనుభవాలు(4)చింతపండు,   పులుపు  నేర్పుగా వ్యవహరించ వలసిన పరిస్థితులు(5)పచ్చి మామిడి ముక్కలు,  వగరు  కొత్త సవాళ్లు(6) కారం,   సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు అందువలన ఇష్టంగా జరుపుకునే పండుగే ఉగాది.

 మరాఠి  ప్రాంతంలో ఉగాది పండుగ

ఈ పండుగను ద్రావిడ భాషలు మాట్లాడే ప్రజలు మరాఠీ ప్రాంతానికి వ్యాప్తి చేసారు, మరాఠీ ప్రాంతంలో  ఈ పండుగ గుడిపడ్వాగా పేరుపొందింది.  

హిందువులకు అత్యంత శ్రేష్ఠమైన ఈ ఉగాది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు. ఆంధ్ర, కర్ణాటకల్లో ఉగాదిగా పరిగణిస్తే మహారాష్ట్రలో “గుడిపాడ్వా” పేరుతో పిలుస్తారు. తమిళులు "పుత్తాండు" అనే పేరుతో, మలయాళీలు "విషు" అనే పేరుతోను, సిక్కులు "వైశాఖీ" గానూ, బెంగాలీలు "పొయ్‌లా బైశాఖ్" గానూ జరుపుకుంటారు. అయితే పండుగను నిర్వహించ డంలో పెద్దగా తేడాలు లేవనే చెప్పవచ్చును. ఆంధ్రప్రదేశ్ లో ఉగాది రోజున పంచాంగ శ్రవణం జరుపుట ఆనవాయితీగా వస్తుంది.ఆ సంవత్సరంలోని మంచి చెడులను, కందాయ ఫలాలను, ఆదాయ ఫలాయాలను, స్ధూలంగా తమ భావిజీవిత క్రమం తెలుసుకొని దాని కనుగుణమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఇష్టత చూపుతూ  ఉగాది పండుగను జరుపు కుంటారు.

సంప్రదాయా పండుగలను  పిల్లలకు తెలియపరచాలి

ఉగాది సంప్రదాయాను సారంగా రైతులను గౌరవించే వేడుకగా చెప్పడం జరిగింది, రైతులతో పాటుగా తెలుగు వారు ప్రతిఒక్కరు కూడా తమదిగా భావించే పండుగ ఉగాది పర్వదినం, చైత్ర శుద్ధ పాడ్యమినాడు వచ్చే తెలుగువారి మొదటి పండుగ ఉగాది,  ఇది వసంత కాలంలో వస్తుంది,  బ్రహ్మ దేవుడు గత ప్రళయం పూర్తి అయిన తర్వాత తిరిగి సృష్టి ప్రారంభించే సమయాన్ని బ్రహ్మకల్పం అంటారు.

 ఇలా ప్రతికల్పంలోను మొదటవచ్చేది యుగాదిని యుగానికి ఆదిగా, ప్రారంభ సమయంగా "ఉగాది" అని వ్యవహరిస్తూ ఉంటారు.

ఈ పండుగ మనకు చైత్రమాసంలో మొదలవుతుంది కనుక ఆ రోజు నుంచి తెలుగు సంవత్సర మొదటి దినంగా పరిగణిస్తాం, ఈ ఉగాది పండుగ రోజున అందరూ ఉదయం వేళ త్వరగా నిద్రలేచి తలంటు స్నానాలు చేసి కొత్త బట్టలు ధరిస్తారు,  ఇంటి ముంగిట మామిడాకుల తోరణాలు కడతారు,  ఇంటి ముందట ముగ్గులు వేసి ఆనిందిస్తారు,  వసంత లక్ష్మిని స్వాగతిస్తారు, షడ్రుచులతో కూడిన ఉగాది ప్రసాదాన్ని పంచాంగానికి, దేవతలకు నైవేద్యం చేసి తమ భవిష్యత్ జీవితాలు ఆనందంగా సాగాలని కోరుతూ ఉగాది పచ్చడి తింటారు,  వైద్య పరంగా ఈ పచ్చడి వ్యాధినిరోధక శక్తిని కలిగిస్తుందంటారు, ఇక ఉదయంవేళ, లేదా సాయంత్రం సమయాలలో పంచాంగ శ్రవణం చేస్తారు, ఉగాది పండుగరోజున అందరూ కలిసి పండితులను ఆహ్వానించి వారిని సన్మానించి పంచాంగ శ్రవణం చేయటం కూడా చేస్తారు. ఆ నూతన సంవత్సరంలోని శుభాలను అశుభాలను తెలుసుకొని దానికి అనుగుణంగా వారి భావి జీవితాన్ని ఆచరించేందుకు మొదలుపెడతారు.

పంచాంగ శ్రవణం అంటే అయిదు అంగాలని అర్ధం చెపుతారు. ఇందులో తిధి, వార, నక్షత్ర, యోగం, కరణం అని అయిదు అంగాలుంటాయి,  వరుసగా ఇవి మానవునికి సంపద, ఆయుష్షు, పాప ప్రక్షాళన, వ్యాధి నివారణ, గంగాస్నాన పుణ్యఫలం వస్తాయని విశ్వసిస్తారు, అందరికి ఆనందం కలిగించే ఈ ఉగాది ఆయురా రోగ్యాలు, సంపదలు, సుఖవంత జీవనం అందించాలని ఆశిస్తూ, ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నాం .

ఇండ్ల మహేష్ జర్నలిస్ట్

మహబూబాబాద్

Image 1

భర్త కురుకురే ప్యాకెట్లు తేలేదని విడాకులకు అప్లై చేసిన భార్య

Posted On 2024-05-16 09:54:06

Readmore >
Image 1

నేడు తెలంగాణ నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు

Posted On 2024-05-16 09:07:38

Readmore >
Image 1

ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2024-05-15 19:01:12

Readmore >
Image 1

కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష : వడ్ల కోనుగోలు పై సీరియస్

Posted On 2024-05-15 13:52:23

Readmore >
Image 1

ఉపాధ్యాయులపై లాఠీచార్జి అమానుషం : TTU రాజన్న సిరిసిల్ల జిల్లా

Posted On 2024-05-15 13:42:59

Readmore >
Image 1

తెలంగాణలో 10 రోజులు థియేటర్లు బంద్

Posted On 2024-05-15 11:32:10

Readmore >
Image 1

కర్నూలు జిల్లాలో బంగారు నిక్షేపాలు

Posted On 2024-05-15 10:33:33

Readmore >
Image 1

ఎల్లమ్మ తల్లి పండుగలో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్

Posted On 2024-05-14 22:33:34

Readmore >
Image 1

తీహార్ జైలుకు బాంబు బెదిరింపు

Posted On 2024-05-14 20:59:56

Readmore >
Image 1

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను సందర్శించిన డాక్టర్ బి. కళావతి భాయి

Posted On 2024-05-14 20:54:19

Readmore >