| Daily భారత్
Logo


ఎమ్మెల్సీగా మన్నే జీవన్ రెడ్డి గెలుపు ఖాయం

News

Posted on 2024-03-27 17:20:49

Share: Share


ఎమ్మెల్సీగా మన్నే జీవన్ రెడ్డి గెలుపు ఖాయం

పారిశ్రామికవేత్తగా అందరి అభిమానం చూరగొన్న నాయకుడు

జీవన్ రెడ్డి గెలుపుతో మహబూబ్ నగర్ జిల్లాకు ప్రయోజనం

బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య ఉన్న వ్యత్యాసాలతో పోల్చుకుని ఓట్లు వేయండి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రేపు జరగబోయే మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి గెలుపు ఖాయమని పిసిసి సభ్యులు మహ్మద్ అలీ ఖాన్ బాబర్, ఐ.న్.టి.యు.సి రాష్ట్ర నాయకులు రఘు, ఫరూక్ నగర్ మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గండ్రతి బాలరాజ్ గౌడ్, సీనియర్ నేత చెంది తిరుపతి రెడ్డి అన్నారు. బుధవారం మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్థానిక ప్రజాప్రతినిధుల నుండి భారీ స్పందన లభిస్తుందని అన్నారు. ఒక కార్మికుడిగా తన జీవన ప్రయాణాన్ని ప్రారంభించి నేడు పారిశ్రామికవేత్తగా ఎదిగి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న నాయకుడు జీవన్ రెడ్డి అని అన్నారు. జీవన్ రెడ్డి గెలుపుతో పాలమూరు పారిశ్రామిక ప్రగతి అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ ఉందని ఈ పోటీలో జీవన్ రెడ్డి గెలుపు ఖాయమని వారు అన్నారు. ఎంతో సాధారణ స్వభావికం గల నాయకుడు తమ అభ్యర్థి జీవన్ రెడ్డి అని అన్నారు. జీవన్ రెడ్డి, నవీన్ రెడ్డికి పోల్చుకుంటే ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఇరువురి మధ్య ఉంటుందని దీనిని స్థానిక ప్రజాప్రతినిధులు గ్రహించాలని అన్నారు. పాలమూరు జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో నవీన్ రెడ్డి గురించి పెద్దగా తెలియదని ఆయన గ్రామానికి వచ్చి ఇక్కడ పరిస్థితులు పరిశీలిస్తే ఏ అభ్యర్థి ఎలాంటివాడు అర్థమవుతుందని పిలుపునిచ్చారు. భూముల అన్యాక్రాంతం తదితర వివాదాస్పద అంశాలను కాంగ్రెస్ నాయకులు ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే పాలమూరు అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆత్మగౌరవంతో ఓటు వేయాలని కోరుతున్న నవీన్ రెడ్డి తన ఆత్మపై ఎంత గౌరవం ఉందో వారి ఊరికి వచ్చి చూడాలని ఈ సందర్భంగా కోరారు. మీడియా సమావేశంలో అగ్గనూరు బసవమప్ప, బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..

Image 1

విత్తనాల ఎంపిక మరియు విత్తనాలు కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు : వ్యవసాయ అధికారి నర్సింహులపేట

Posted On 2024-05-16 22:34:57

Readmore >
Image 1

వేసవి లోతు దుక్కుల వలన కలిగే ప్రయోజనాలు

Posted On 2024-05-16 22:30:45

Readmore >
Image 1

డెంగ్యూ వ్యాధి ప్రజారోగ్యానికి పెను సమస్య: జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి.కళావతి బాయి

Posted On 2024-05-16 21:46:48

Readmore >
Image 1

పిడుగుపాటుకు గురై ఒకరు మృతి

Posted On 2024-05-16 19:48:35

Readmore >
Image 1

ఏసీబీ వలలో వ్యవసాయ అధికారి

Posted On 2024-05-16 19:23:17

Readmore >
Image 1

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

Posted On 2024-05-16 17:38:06

Readmore >
Image 1

ఇచ్చిన హామీల్లో మరోదానికి ఎగనామం? సన్న వడ్లకే బోనస్ అంటున్న రేవంత్ రెడ్డి

Posted On 2024-05-16 14:12:24

Readmore >
Image 1

అలిపిరి వద్ద కారు దగ్ధం

Posted On 2024-05-16 13:34:02

Readmore >
Image 1

భర్త కురుకురే ప్యాకెట్లు తేలేదని విడాకులకు అప్లై చేసిన భార్య

Posted On 2024-05-16 09:54:06

Readmore >
Image 1

నేడు తెలంగాణ నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు

Posted On 2024-05-16 09:07:38

Readmore >