| Daily భారత్
Logo




ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి కార్యక్రమంలో సమస్యలు లేకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి

News

Posted on 2025-10-06 17:22:55

Share: Share


ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి కార్యక్రమంలో సమస్యలు లేకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి

కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి కార్యక్రమం ద్వారా రైతులు సకాలంలో తమ భూ సంబంధిత సమస్యలను పరిష్కరించుకునేలా చొరవ చూపాలని, దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావు లేకుండా వెంటదివెంట ఆర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. సోమవారం ఆయన వర్ని తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసిల్దార్, ఇతర సిబ్బందితో భూభారతి అమలుపై సమీక్ష జరిపారు. రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యుల్స్ లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు, ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, ఎంత మందికి నోటీసులు ఇచ్చారు, క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తయ్యిందా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయి పరిశీలనలో ఒకింత జాప్యం జరుగుతుండడాన్ని గమనించిన కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. రెండు నెలలుగా దరఖాస్తులు పెండింగ్ లో ఉండడానికి గల కారణాలు ఏమిటని ప్రశ్నించారు. నిర్ణీత గడువు లోపు అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. దరఖాస్తులు తిరస్కరణ అయితే, అందుకు గల కారణాలు స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. సాదా బైనామా, పీఓటీ లకు సంబంధించిన అప్లికేషన్ లను క్షుణ్ణంగా పరిశీలన జరపాలని, వెంట వెంటనే నోటీసులు జారీ చేస్తూ, క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ నిర్వహించాలని అన్నారు. భూభారతి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఆర్జీల పరిష్కారంలో జాప్యం జరుగకుండా రోజువారీగా దరఖాస్తుల పరిశీలనను పర్యవేక్షిస్తూ, వేగవంతంగా వాటిని పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు.

Image 1

ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-27 10:56:55

Readmore >
Image 1

గంటలోనే ముగ్గురు మైనర్ బాలికల ఆచూకీ..

Posted On 2026-06-27 07:16:30

Readmore >
Image 1

పిల్లలకు తప్పనిసరిగా పోలియో టీకా వేయించాలి : మంత్రి దామోదర

Posted On 2026-06-27 07:11:39

Readmore >
Image 1

మధ్యప్రదేశ్‌లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR

Posted On 2026-06-26 22:39:46

Readmore >
Image 1

అల్లుడితో వివాహేతర సంబంధం... భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-06-26 22:21:24

Readmore >
Image 1

సొంతగడ్డపై మమకారం..!

Posted On 2026-06-26 20:19:36

Readmore >
Image 1

హాజిపల్లిలో "గ్రామ కంఠం" భూమి కబ్జా..!

Posted On 2026-06-26 20:15:06

Readmore >
Image 1

లంచం సామ్రాజ్యం... మంజుల పత్తిపాటి

Posted On 2026-06-26 20:09:15

Readmore >
Image 1

స్వర్ణకారుల సమస్యల పరిష్కారానికి గళమెత్తిన సంఘాలు

Posted On 2026-06-26 19:34:47

Readmore >
Image 1

ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలి

Posted On 2026-06-26 19:33:09

Readmore >