Posted on 2025-09-26 16:18:20
డైలీ భరత్ న్యూస్ నిజామాబాద్: శుక్రవారం కాంగ్రెస్ భవన్ లో ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణు రాజ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్, బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేణు రాజు మాట్లాడుతూ ఈరవత్రి అనిల్ పుట్టినరోజు వేడుకలు కాంగ్రెస్ భవన్ లో నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది అని, ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈరవత్రి అనిల్ ఎల్లప్పుడు బడుగు బలహీన ప్రజల కోసం ఆలోచిస్తూ వారి అభివృద్ధి తమ సంతోషంగా భావించి పనిచేసిన నాయకుడని, ఎల్లవేళల కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సేవ చేసిన నాయకుడని ఆయనను కొనియాడారు. ఈరవత్రి అనిల్ మరింత ఎత్తుకు ఎదిగి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థించారు. కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయికిరణ్, శివ. హరీష్. అభిలాష్, గణేష్ ,పండు, ధనుషు, తేజ, రవి, రాజు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ ఆదేశాల మేరకు ఉప సర్పంచుల సమస్యలపై అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్‌కు వినతి పత్రం
Posted On 2026-07-28 14:02:59
Readmore >
కోర్టు విచారణల వీడియోలు సోషల్ మీడియాలో వినియోగంపై సుప్రీంకోర్టు కఠిన ఆంక్షలు
Posted On 2026-07-28 14:01:16
Readmore >
గోమాతను విశ్వమాతగా ప్రకటించాలని ర్యాలీ, కలెక్టర్ కు వినతి పత్రం అందజేత
Posted On 2026-07-28 08:06:38
Readmore >
అర్ధరాత్రి అప్రమత్తతతో వ్యక్తి ప్రాణాలు కాపాడిన రాజాపూర్ పోలీసులు
Posted On 2026-07-28 08:04:20
Readmore >
అంగమలి - శబరిమల రైలు మార్గం భూసేకరణ ప్రారంభించిన కేరళ ప్రభుత్వం
Posted On 2026-07-27 18:35:56
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపిన జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర మండల వాసులు
Posted On 2026-07-27 17:05:43
Readmore >