Posted on 2025-07-26 12:50:29
బ్యాంకులు,ATM ల వద్ద నిఘా వ్యవస్థను పటిష్టం చేసుకోవాలి
సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అరికట్టవచ్చు
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వలన నేరాలను అరికట్టే అవకాశం ఉందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ అన్నారు.జిల్లా పరిధిలోని పరిశ్రమలు,వ్యాపార సముదాయాలు,కాలనీలు మరియు ఇండ్ల పరిసరాలలో సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెంజిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఒక ప్రకటనలో తెలిపారు.ముఖ్యంగా బ్యాంకులు,ATM ల వద్ద సీసి కెమెరాలతో పాటు సెక్యూరిటీ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.కాలనీలు,కమ్యూనిటీలలోకి ప్రవేశించే డెలివరీ బాయ్స్ యొక్క వివరాలను నమోదు చేసుకున్న తర్వాత మాత్రమే వారిని అనుమతించాలని తెలిపారు.ఇంటి యజమానులు తమ ఇండ్లలో అద్దెకు నివసించే వ్యక్తుల పూర్తి వివరాలను సేకరించుకొని తమ వద్ద పెట్టుకోవాలని తెలిపారు.దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఇండ్లలో విలువైన వస్తువులను ఉంచకూడదని,అదే విధంగా ఇరుగు పొరుగు వారికి,స్థానిక పోలీసు వారికి సమాచారం అందించాలని సూచించారు.తమ తమ నివాస ప్రదేశాల్లో అర్ధరాత్రి వేళల్లో ఎవరైనా వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసువారికి సమాచారం అందించాలని కోరారు.తెల్లవారుజామున ఇండ్ల ముందు వాకిలి శుభ్రం చేసేటప్పుడు,రోడ్లపై వాకింగ్ చేసే సమయాల్లో బంగారు ఆభరణాలను ధరించరాదని సూచించారు.ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని,సీసీ కెమెరాల వల్ల భద్రతా ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు.దొంగతనాల నివారణకు,రోడ్డు ప్రమాదాల్లో వాహనాలను గుర్తించేందుకు సీసీ కెమెరాలు పోలీసు వారికి ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు.జిల్లాలోని ప్రధాన రహదారులు,ముఖ్యమైన ప్రదేశాలలో కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను అరికట్టవచ్చని తెలిపారు.పరిశ్రమల యాజమాన్యాలు,వ్యాపారస్తులు మరియు అన్ని వర్గాల ప్రజలు పోలీసు వారికి సహకరించాలని కోరారు.ఇప్పటికే జిల్లాలో నమోదైన చాలా కేసులలో సీసీ కెమెరాల ద్వారా నిందితులను పట్టుకోవడం జరిగిందని అన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని ముఖ్యమైన ప్రదేశాలు మరియు కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు.నేరాలను ఛేదించడంతోపాటు నియంత్రించడంలో సీసీ కెమెరాల పాత్ర కీలకంగా మారిందని అన్నారు.కావున జిల్లా ప్రజలందరూ పోలీస్ యంత్రాంగానికి సహకరిస్తూ తాము నివసించే ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
పిట్లం మండల కేంద్రంలో ఘనంగా శుభ శ్రీ ఎలక్ట్రిక్ మోటార్స్ షోరూం ప్రారంభోత్సవం
Posted On 2026-07-24 09:13:16
Readmore >
కామారెడ్డిలో అత్యాధునిక సౌకర్యాలతో "వీ నో డెంటల్ క్లినిక్" ప్రారంభం
Posted On 2026-07-24 09:09:28
Readmore >
జూలూరుపాడు మండలంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు
Posted On 2026-07-24 09:02:05
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ బాక్స్ కల్వర్ట్ ప్రారంభించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
Posted On 2026-07-24 09:00:44
Readmore >
వంశీ ఆత్మహత్య ఘటన బాధాకరం : బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య
Posted On 2026-07-24 04:25:46
Readmore >
ఎల్లన్నగర్ గ్రామంలో 20 ఏళ్ల నిరీక్షణకు తెర... రూ.15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం
Posted On 2026-07-23 16:06:22
Readmore >
ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల సాధన రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలి
Posted On 2026-07-23 16:04:59
Readmore >